TSPSC Revanth Reddy: టీఎస్పీఎస్సీపై రేవంత్‌ రివ్యూ.. నోటిఫికేషన్ల విడుదలపై కీలక నిర్ణయం?

సచివాలయంలో టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, పలువురు సభ్యులు రాజీనామాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. వాయిదా పడ్డ పరీక్షలు, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లపై ఈ మీటింగ్‌లోనే రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

New Update
TSPSC Revanth Reddy: టీఎస్పీఎస్సీపై రేవంత్‌ రివ్యూ.. నోటిఫికేషన్ల విడుదలపై కీలక నిర్ణయం?

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో TSPSC నోటిఫికేషన్ల రిలీజ్ కోసం అభ్యర్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. TSPSCని కాంగ్రెస్‌ ప్రక్షాళన చేయనుందన్న ఓవైపు భారీ ఎత్తునసాగుతోంది. ఇదే సమయంలో TSPSCలోని కీలక పదవుల్లో ఉన్నవారు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అయితే ఈ రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు. ఇటీవలే తమిళిసైని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. తమిళిసైతో రాజీనామాల ఆమోదంతో పాటు TSPSCపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఇదే సమయంలో TSPSCపై రేవంత్‌రెడ్డి రివ్యూ పెట్టారు.

నోటిఫికేషన్లపై నిర్ణయం?
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు(జనవరి 2) సచివాలయంలో టీఎస్పీఎస్సీపై కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు(ఉదయం 11 గంటలకు సమీక్ష ప్రారంభం). టీఎస్పీఎస్సీ ఛైర్మన్, పలువురు సభ్యులు రాజీనామాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అటు వాయిదా పడ్డ పరీక్షలు, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు సహా పలు అంశాలపై ఈ రివ్యూ మీటింగ్‌లోనే రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

టీఎస్పీఎస్సీ పరీక్షలపై రేవంత్‌ రెడ్డి గత డిసెంబర్ 27న కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వోద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీకి (TSPSC) కొత్త చైర్మన్‌, సభ్యుల నియామకం జరగగానే నియామకాల ప్రక్రియను అత్యంత వేగంగా, పారదర్శకంగా చేపడతామని భరోసా ఇచ్చారు. 2024 డిసెంబరు 9లోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత ఆందోళన చెందవద్దని కోరారు. చైర్మన్‌, సభ్యుల రాజీనామాను గవర్నర్‌ ఆమోదించిన వెంటనే పారదర్శకంగా కొత్త బోర్డును నియమిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ (Congress Job Calender) ప్రకారం నియామకాలు జరుగుతాయని, యువత ఆందోళన చెందవద్దని కోరారు. ఫిబ్రవరి ఒకటి నాటికి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: పార్టీ ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర సమావేశం.. కీలక ప్రకటనకు ఛాన్స్!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు