MS Dhoni coach: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ(Dhoni) బ్యాటింగ్‌పై వంద మందికి వంద రకాల అభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ కీపర్‌గా ధోనీపై దాదాపుగా అందరికి ఒకే తరహా ఓపినియన్ ఉంటుంది. మెరుపు వేగంతో స్టంప్స్‌ను గిరాటేసే ధోనీని ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. ఎంతో తెలివిగా వికెట్ల వెనుక వ్యవహారిస్తాడు ధోనీ. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్‌లో (IPL) ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాడు మహేంద్రుడు. 40ఏళ్లు దాటినా వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తడంలో కానీ లైట్ స్పీడ్‌తో స్టంపింగ్ చేయడంలో కానీ ధోనీకి సాటి లేరు. అయితే ధోనీ నిజానికి వికెట్ కీపర్ కావాలని అనుకోలేదు.. అసలు క్రికెటర్ అవ్వాలనే థింక్ చేయలేదు.. ఫుట్‌బాల్ గోల్ కీపర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఓ వ్యక్తి ధోనీని కీపింగ్ గ్లౌవ్స్ వేసుకునేలా చేశాడు.
తొలి గురువు:
ధోనీ ఫస్ట్ క్రికెట్ కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ (Keshav Ranjan Banerjee), రాంచీలోని జవహర్ విద్యామందిర్‌లో చదువుకుంటున్నప్పుడు ధోనీ ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి. ధోనీ గోల్ కీపర్ కావాలనుకున్నాడని, వికెట్ కీపర్‌గా మారాలని ధోనీకి సూచించింది కేశవ్ బెనర్జీ అని, ఆ తర్వాత ధోనీని వికెట్ కీపర్-బ్యాటర్ తీర్చిదిద్దాడని అందరికీ తెలిసిన విషయమే. ధోనీ తనను కలవడానికి వచ్చినప్పుడల్లా క్రికెట్ గురించి మాట్లాడడానికి ఇష్టపడనని, పాఠశాలలోని క్రీడా కార్యకలాపాల గురించి మాట్లాడటానికి తన సమయాన్ని వెచ్చిస్తానని కేశవ్ బెనర్జీ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Also Read: వరల్డ్ కప్‌కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..స్టార్ కీపర్‌కు నో ఛాన్స్!
ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో బెనర్జీ సర్ పాత్రను రాజేష్ శర్మ పోషించారు. పర్ఫెక్ట్ బెంగాలీ యాసతో ఆ పాత్రను పోషించారు. కేశవ్ రంజన్ బెనర్జీ ఇప్పటికీ విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు. అతను రాంచీలో 'బెనర్జీ సర్' గా ప్రసిద్ధి చెందాడు. గతంలో తానుపై తరగతుల నుంచి మాత్రమే క్రీడాకారులను పొందేవాడినని, ఇప్పుడు ఆరో తరగతి నుంచే నేర్చుకుంటున్నానని తెలిపాడు. 'ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు ఉన్నారు. ధోనీ లాంటి ఆటగాళ్లు చాలా అరుదు. నేను మరో ధోనీని తయారు చేయలేను. ఈ పిల్లలు చాలా ప్రతిభావంతులు, కానీ చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలు తదుపరి ధోని కావాలని కోరుకుంటున్నారు. నా దగ్గర మంత్రదండం లేదు. కానీ ధోనీ నుంచి స్ఫూర్తి పొంది పిల్లలు చాలా కష్టపడతారు, వారు విజయం సాధిస్తారు, నన్ను గర్వపడేలా చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను' అని బెనర్జీ ఇండియాటైమ్స్(India times)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
ALSO READ: సూపర్-4 వేదికల్లో మార్పుపై క్లారిటీ.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?