/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/medico-racahan-reddy-jpg.webp)
Rachana Reddy death case Updates: ముత్తంగి ORR వద్ద సోమవారం తన కారులో అపస్మారక స్థితిలో ఉన్న 26 ఏళ్ల మెడికో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మృతురాలిని ఆర్.రచనారెడ్డిగా గుర్తించారు. ఆర్.సి.పురంలోని హెచ్‌ఐజీలోని తన ఇంటి నుంచి ఉదయం 8 గంటలకు బాచుపల్లిలోని మమత ఆస్పత్రికి వెళుతున్నానని తల్లిదండ్రులకు చెప్పిన రచనారెడ్డి సడన్‌గా చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో రచనా అన్నయ్య చెప్పే విషయాలు కీలకంగా మారనున్నాయి.
అతనితో మనస్పర్థలే కారణమా?
ఇటీవలే రచనారెడ్డికి పెళ్లి నిశ్చియమైంది. వచ్చే నెలలో పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈలోపే ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండుగా.. రచనారెడ్డి బంధువులు మాత్రం తమకు ఎలాంటి డౌట్స్ లేవంటున్నారు. అయితే తన చెల్లి డిప్రెషన్‌లో ఉందని రచనా అన్నయ్య చెబుతున్నాడు. తన చెల్లి ఎందుకిలా చేసుకుందో అర్థం కావడం లేదని చెప్పిన రచన అన్న.. చనిపోవడానికి ముందు కూడా తనకు ఫోన్ చేసిందని అంటున్నాడు. ఆస్పత్రికి వెళుతున్నా అని చెప్పిందని... టెన్షన్ వద్దు డ్యూటీకి వెళ్లమని చెప్పానని చెబుతున్నాడు. ఈలోపే మృతిపై సమాచారం వచ్చిందని.. తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని అంటున్నాడు. అసలు కారణం ఏంటన్న దానిపై విచారణ జరుగుతుండగా.. పెళ్లి నిశ్చియమైన యువకుడితో మనస్పర్థల కారణంగానే రచనా కలత చెంది ఆత్మహత్య చేసుకుందని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
పోలీసులు ఏం అంటున్నారు?
రచనా రెడ్డి తన మణికట్టు ద్వారా గుర్తుతెలియని డ్రగ్‌ను ఇంజెక్ట్ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఎడమ మణికట్టుపై ఒక కాన్యులా , డ్రైవర్ సీటు దగ్గర ఒక జత ఖాళీ సిరంజిలు దొరికాయి. అందుకే ఇది క్లియర్ కట్‌గా సూసైడ్ కేసు అని అంటున్నారు. గత నవంబర్‌లో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చితార్థం చేసిన తర్వాత ఈ పరిణామాలు జరగడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. రచన తండ్రి ప్రకేష్ రెడ్డి బొటిక్ నడుపుతున్నాడు. ఆమె తల్లి గృహిణి.
Also Read: హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్!