Tomato Farmer: నెల రోజుల్లో రూ.కోటి పైనే సంపాదించిన టమాటా రైతు

టమాటా ధరలు పెరగడంతో ఆ రైతుల పంట పండింది. ఒకప్పుడు ధరలు లేక రోడ్లపై పంటను పారబోసిన రైతులు ఇప్పుడు దర్జాగా పంటను అమ్ముకుంటున్నారు. కొందరు లక్షలు అందిస్తుంటే.. మరికొందరు కోట్లకు పడగెత్తుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ రైతు కూడా స్థానం సంపాదించుకున్నాడు.

Tomato Farmer: నెల రోజుల్లో రూ.కోటి పైనే సంపాదించిన టమాటా రైతు
New Update

Tomato Farmer

కోటీశ్వరుల జాబితాలో మెదక్ రైతు..

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకప్పుడు కనీస ధరలు కూడా లేక అప్పుల ఊబిలో కురుక్కుపోయిన రైతులు.. ఇప్పుడు కోటీశ్వరులు అవుతున్నారు. ప్రస్తుతం యాపిల్ కంటే టమాటాలే మార్కెట్‌లో ఎక్కువ రేటు పలుకుతున్నాయి. కిలో ట‌మాటా ధ‌ర రూ. 100పైనే పలకడంతో టమాటాను పండిస్తున్న రైతులు లక్షాధికారులు అయ్యారు. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కొందరు రైతులైతే ఏకంగా కోట్లు సంపాదిస్తున్నారు. ఇలా ట‌మాటాలు అమ్మి కోటీశ్వరులైన రైతుల జాబితాలో మ‌న మెద‌క్ జిల్లాకు చెందిన ఓ రైతు కూడా చేరాడు.

నెలరోజుల్లోనే రూ.1.80కోట్లు సంపాదన..

మెద‌క్ జిల్లాలోని కౌడిప‌ల్లికి చెందిన రైతు మ‌హిపాల్ రెడ్డి త‌న‌కున్న 40 ఎక‌రాల్లో వివిధ రకాల కూర‌గాయలు పండించాడు. అందులో 8 ఎక‌రాల్లో కేవ‌లం ట‌మాటా సాగు మాత్ర‌మే చేశారు. మండుటెండ‌ల స‌మ‌యంలో పంట వేసిన‌ప్ప‌టికీ.. షెడ్ నెట్స్ ఉప‌యోగించి, ఆ పంట‌ను కాపాడాడు. ఇక ఎప్పుడైతే మార్కెట్‌లో ట‌మాటా ధ‌ర అమాంతం పెరిగిందో ఆ స‌మ‌యానికే ట‌మాటా పంట చేతికొచ్చింది. ఇంకేముంది పండిన పంట మొత్తాన్ని అమ్మి నెలరోజుల్లోనే కోటీ ఎనభై లక్షలు రూపాయలు సంపాదించాడు.

చదువులో ఫెయిల్.. వ్యవసాయంలో సక్సెస్..

టమాటా పంటను కౌడిప‌ల్లి నుంచి ప‌టాన్‌చెరు, షాపూర్, బోయిన్‌ప‌ల్లి మార్కెట్ల‌కు త‌ర‌లించి, అమ్ముతున్నట్టు మ‌హిపాల్ రెడ్డి తెలిపారు. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి కూర‌గాయ‌లు పండిస్తున్నపటికీ ఇంత లాభం ఎప్పుడూ రాలేద‌న్నారు. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కోటి రూపాయాలు సంపాదించ‌డం ఆనందంగా ఉండ‌ట‌మే కాక ఆశ్చ‌ర్యంగా కూడా ఉంద‌న్నారు. ఈ సీజ‌న్‌లో మొత్తం 7వేల బాక్సుల ట‌మాటాను అమ్మినట్లు తెలిపారు. ఒక్కో బాక్సు రూ.2,600కు అమ్మానని చెప్పారు. ఇంకో ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే ఈ రైతు ప‌దో త‌ర‌గతి ఫెయిల్ అయ్యారు. చదువు అబ్బకపోవడంతో వ్య‌వ‌సాయంపై దృష్టి సారించారు. త‌న భార్య స‌హ‌కారంతో కూర‌గాయ‌ల సాగు ప్రారంభించారు. మొత్తంగా 20 ఏళ్ల త‌ర్వాత మ‌హిపాల్ పంట పండింది. మ‌హిపాల్ భార్య బాన్సువాడ దివ్య.. మ‌హ‌మ్మ‌ద్ న‌గ‌ర్ స‌ర్పంచ్‌గా పనిచేస్తున్నారు.

మరికొంతమంది కోటీశ్వరులు అయ్యే అవకాశం..

కర్ణాటకలోని కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం కూడా 2వేల బాక్సుల టమాటా అమ్మి ఏకంగా రూ. 38 లక్షలు సంపాదించినట్లు పేర్కొంది. బేతమంగళ జిల్లాకు చెందిన ప్రభాకర్ గుప్తా 40 ఎకరాల్లో గత 40 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నారు. ఒక్కో బాక్స్ రూ. 1900లకు అమ్మారు. అలాగే చింతామణి తాలుకా విజకూర్ గ్రామానికి చెందిన రైతు వెంకట రమణారెడ్డి టమాట బాక్సును రూ. 2200లకు విక్రయించి లక్షలు సంపాదించారు. మరికొద్ది రోజుల్లో కిలో టమాటా రూ.300 చేరనుందనే వార్తల నేపథ్యంలో మరికొంత మంది టమాటా రైతులు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe