Karnataka : ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి శుభవార్త.. రూ.10కే మీల్స్, రూ.5 కే టిఫిన్!

కర్నాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో కేవలం రూ. 10కే భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా క్యాంటీన్ ను ఎయిర్ పోర్టులో ప్రారంభించాలని ఆ రాష్ట్ర కెబినేట్ డిసైడ్ అయ్యింది.

Karnataka :  ఎయిర్ పోర్టుకు  వెళ్లే వారికి శుభవార్త.. రూ.10కే మీల్స్, రూ.5 కే టిఫిన్!
New Update

కర్నాటక మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ధరలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో కేవలం రూ. 10లకే భోజనం అందించే విధంగా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా క్యాంటీన్ ను ప్రారంభించాలని కర్నాటక మంత్రి వర్గం నిర్ణయించింది. సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారా పదార్ధాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి అస్సలు ఉండు. ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రూ. 10లకే భోజనం, రూ. 5లకే టిఫిన్ అందించాలని కర్నాటకలోని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది.

ఈ మేరకు బెంగుళూరు విమానాశ్రయంలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖరీదైన ఫుడ్ అవుట్ లెట్లలో కూడా సామాన్యులు, మధ్య తరగతి వారికి ఆహారం అందించాలన్న లక్ష్యంగా అక్కడి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్న ఇందిరా క్యాంటిన్ భాగంగా ఎయిర్ పోర్టులో పార్కింగ్ ప్రదేశంలో రెండు క్యాంటీలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు త్వరలోనే వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. కాగా బెంగళూరు నగరంలో 175కిపైగా ఇందిరా క్యాంటీన్ లు ఉన్నాయి .ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్లలో కేవలం రూ. 5కే అల్పాహారం రూ. 10కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ హాయాంలో ఇందిరీ క్యాంటీన్లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని వాటిని మూసేయాలని కూడా ఆలోచన చేశారు.

అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్లలో లంచ్ , స్నాక్స్ మెనూను మార్చేశారు. రాగి ముద్ద, మంగళూరు బన్స్ తోపాటు పలు రకాల భోజనాలు ఇక్కడ వడ్డీస్తున్నారు. ఖరీదైన ఫుడ్ అవుట్ లెట్లలో కూడా ఇందిరా క్యాంటీన్ లో భోజనం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అల్పాహారం మెనూ

- సాంబారుతో ఇడ్లీ

-చట్నీతో ఇడ్లీ

-పెరుగు బజ్జీ, వెజ్ పలావ్

-ఖరాబత్ చట్నీ

-చట్నీతో చౌచౌబాత్

-మంగళూరు బన్స్

-సాధారణ బన్స్

-జామ్ బ్రెడ్

-చట్నీతో పొంగల్

-బూందీతో బిస్బెలేబాత్

-చిత్రాన్న

పై వన్నీ కూడా కేవలం రూ. 5లకే అందించనున్నారు.

లంచ్ మెనూ:

-వెజిటెబుల్ సాంబార్ తో అన్నం

-తకరారి సాంబార్, రైతాతో అన్నం

-పచ్చిమిర్చి పులుసుతో రాగిముద్ద

-వెజ్ గ్రేవీతో చపాతీ

ఇవన్నీ కూడా రూ. 10లకే అందించనున్నారు.

ఇది కూడా చదవండి: అలర్ట్…ఈ 16 రోజులు బ్యాంకులు బంద్…ఈ తేదీల్లో పనులుంటే మానుకోండి..!!

#bangalore #meal-at-just-rs-10 #karnataka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe