MDNIY ఆధ్వర్యంలో 6 రోజులపాటు వైద్య విద్య ప్రోగ్రామ్స్.. యోగాపై స్పెషల్ ట్రైనింగ్!

ఆగస్టు 19 నుంచి 24 వరకు 6 రోజులపాటు వైద్య విద్యపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించనున్నట్లు 'మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా' తెలిపింది. యోగా జ్ఞానం, అభ్యాసాలు, చికిత్సా పద్ధతులు, తాజా పరిశోధనలు, ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు.

New Update
MDNIY ఆధ్వర్యంలో 6 రోజులపాటు వైద్య విద్య ప్రోగ్రామ్స్.. యోగాపై స్పెషల్ ట్రైనింగ్!

MDNIY CME: ఉపాధ్యాయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, శాస్త్రవేత్తల కోసం ఆగస్టు 19 నుంచి 24 వరకు ఆరు రోజులపాటు వైద్య విద్య (CME) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY), ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం యోగాలో తాత్విక, శాస్త్రీయ, ఆచరణాత్మక విద్యా, చికిత్సా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేయనున్నట్లు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.

పరిశోధనా పద్ధతులు లేకపోతే ప్రయోజనం ఉండదు..
ఈ రోజు మొదలైన ప్రారంభ సమావేశంలో ప్రముఖ వక్త, డాక్టర్ కె.కె. దీపక్ మాట్లాడుతూ.. యోగా, అనుబంధ శాస్త్రాలను అభివర్ణిస్తూ కార్యక్రమం ప్రాముఖ్యత గురించి వివరించారు. 'సరైన పరిశోధనా పద్ధతులు లేకుండా మానవ జీవితంపై యోగా ఏమాత్రం ప్రభావం చూపదన్నారు. అల్లోపతి శాస్త్రాలలో పరిశోధనా ప్రోటోకాల్‌ల ప్రామాణీకతను పోలుస్తూ పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆయుర్గ్యాన్ పథకం వంటి కార్యక్రమాల ద్వారా యోగ శాస్త్రాలలో పరిశోధన పద్ధతులను అప్‌గ్రేడ్ చేయవచ్చని చెప్పారు.

సాంప్రదాయ యోగా సూత్రాల సమ్మేళనం..
ఇక మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్. కాశీనాథ్ సమగండి మాట్లాడుతూ.. ఆయుష్ మంత్రిత్వ శాఖ చొరవ, రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ మద్దతుతో ఆయుష్ వైద్యుల సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో యోగాను అన్ని రంగాల్లో చేర్చడం జరిగిందన్నారు. మినిస్ట్రీ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమం ప్రత్యేకంగా ఆయుష్ వైద్యులు వారి రోజువారీ అభ్యాసంలో యోగాను అనుసంధానించేలా రూపొందించబడిందన్నారు. భారతదేశం అంతటా యోగా పరిశోధనలో ప్రముఖ నిపుణులు తమ జ్ఞానాన్ని అందించడానికి ముందుకొస్తున్నారు. సీఎంఈ.. ప్రాప్ యోగా, మాడ్యులేటెడ్ యోగా, ప్రాక్టికల్ డెమోన్‌స్ట్రేషన్‌లు, డైట్ యోగా, ఆయుర్వేదం యోగా సహా అనేక రకాల అంశాలను కవర్ చేస్తుంది. ఈ అవకాశం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 మంది పార్టిసిపెంట్‌లకు ఎంతో మేలు చేస్తుందని కాశీనాథ్ తెలిపారు.

డిప్యూటీ డైరెక్టర్ Md. తైయాబ్ ఆలం..
సీఎంఈ కార్యక్రమం యువ పరిశోధకులు, నిపుణులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని కమ్యూనికేషన్ & డాక్యుమెంటేషన్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ Md. తైయాబ్ ఆలం చెప్పారు. వారితో అప్‌డేట్‌గా ఉండటానికి ఈ సాధనం మరింత జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. యోగా మానవుల్లో శాస్త్రీయ జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేయడంతో తోడ్పడుతుందన్నారు.

శాస్త్రీయ పరిశోధన పోకడలు, ఆధునిక బోధనా పద్ధతులు..
ఇక వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు.. డాక్టర్ కె.కె. దీపక్ విజిటింగ్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ (CBME), ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ (IIT) న్యూఢిల్లీ. పద్మశ్రీ డాక్టర్. S C మంచందా సీనియర్ కన్సల్టెంట్, సర్ గంగా రామ్ హాస్పిటల్. డాక్టర్ బి.ఎన్. గంగాధర్ MARB అధ్యక్షుడు, NMC చైర్‌పర్సన్. డాక్టర్ ఐ.వి. బసవరద్ది మాజీ డైరెక్టర్ MDNIY. డాక్టర్ రాఘవేంద్రరావు డైరెక్టర్ CCRYN. భారతదేశంలోని ఇతర ప్రముఖ వక్తలతో సహా IBHAS డైరెక్టర్ ప్రొఫెసర్. R. ధమిజా పాల్గొననున్నారు.

వీరంతా యోగా జ్ఞానం, యోగ అభ్యాసాలు, యోగా చికిత్సా పద్ధతులు, యోగాలో ఇటీవలి శాస్త్రీయ పరిశోధన పోకడలు, ఆధునిక బోధనా పద్దతులతో సహా కీలక విషయాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం యోగా కార్యక్రమాల్లో పాల్గొనేవారి అవగాహనను మరింతగా పెంచడం, సాంప్రదాయ, సమకాలీన శాస్త్రీయ జ్ఞానాన్నిపెంపొందించడం. అలాగే ఈ కార్యక్రమాన్ని డా.డి. ఎలంచెజియన్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, WHOCC, డా. ఖుష్బు జైన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయోకెమిస్ట్రీ), అసిస్టెంట్ ప్రొఫెసర్ (యోగా థెరపీ) డాక్టర్ ఎస్. లక్ష్మీ కందన్ సమన్వయం చేస్తున్నారు.



Advertisment
Advertisment
తాజా కథనాలు