McGill University Studies : ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ (Smartphone), టెక్నాలజీ (Technology) వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో ప్రతి పని స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతోంది. చాలా సమయంతో పని లేకుండా రోజంతా గంటల తరబడి స్మార్ట్ ఫోన్ల పై గడిపేస్తుంటారు. అయితే ఇటీవలే స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి సంబంధించి మెక్‌గిల్ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ విడుదల చేసింది. మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఏ దేశంలో ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలు అవుతున్నారో చెప్పబడింది.
మెక్‌గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World Of Statistics), మెక్‌గిల్ విశ్వవిద్యాలయం సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో బాధపడుతున్న ప్రపంచంలోని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోని మొదటి 10 దేశాలలో చైనా, సౌదీ అరేబియా, మలేషియా, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇరాన్, కెనడా, టర్కీ, ఈజిప్ట్ మరియు నేపాల్ ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో చైనా అగ్రస్థానంలో ఉంది
మెక్‌గిల్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం, స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో చైనా (China) ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో మలేషియా మూడో స్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలైన దేశాల జాబితాలో బ్రెజిల్ నాల్గవ స్థానంలో ఉంది. అయితే దక్షిణ కొరియా ఐదో స్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో భారతదేశం 17వ స్థానంలో ఉంది.