🛑LIVE BREAKINGS: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

author-image
By Prasanth Reddy
New Update
BREAKING NEWS
  • Dec 18, 2024 13:11 IST

    అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

    ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు.

    Ravi Chandran Ashwin

    https://rtvlive.com/national/indian-cricketer-r-ashwin-announced-his-retirement-8449275



  • Dec 18, 2024 11:28 IST

    తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల‌కు ఊర‌ట‌.. హైకోర్టు కీలక తీర్పు!

    పీజీ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి సంబందించి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. . 15% ఆలిండియా కోటాలో.. తెలంగాణలో MBBS, BAMS, BHMS పూర్తిచేసిన రాష్ట్రేతర విద్యార్థులు విద్యార్థులు కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్థానిక కోటా కింద అర్హులని తెలిపింది.



  • Dec 18, 2024 09:50 IST

    జమ్ముకశ్మీర్‌‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

    జమ్మూకశ్మీర్‌లోని కథువాలో రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం కావడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.



  • Dec 18, 2024 09:19 IST

    లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి

    లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. లోన్‌యాప్‌లో తీసుకున్న రూ.3 లక్షలు కట్టలేకపోవడంతో ఏజెంట్లు వేధింపులు పెట్టారు. దీంతో మానసిక ఆవేదన చెంది ఆ యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.



  • Dec 18, 2024 08:39 IST

    కేటీఆర్‌కు బిగ్ షాక్.. రెండు రోజుల్లో నోటీసులు?

    ఫార్ములా- ఈ కార్‌ రేసు వ్యవహారంలో ఏసీబీ మరో రెండు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ సమయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం.



  • Dec 18, 2024 08:38 IST

    ఏపీలో విషాదం...బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

    శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండలం అనంతసాగరంలో రెండేళ్ల బాలుడు మోక్షజ్ఞ బస్సు టైర్‌ కిందపడి మరణించాడు. బస్సులో క్లీనర్‌ లేకపోవడమే చిన్నారి ప్రమాదానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

     



  • Dec 18, 2024 07:47 IST

    బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుంది. దీనివల్ల తమిళనాడు, ఏపీ, యానాంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు