France: ఫ్రాన్స్‌లో ఆగని అల్లర్లు.. ఏకంగా పారిస్ మేయర్ కారుకే నిప్పు ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్‌లో గత జూన్ 27 రాత్రి మొదలైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి.వేలమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఎదురొచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారుల ఆగ్రహానికి ఇప్పటికే 2,500 పైగా వాహనాలు బూడిదయ్యాయి. వందలకొద్దీ షాపులు, మాల్స్ ధ్వంసమయ్యాయి. పారిస్ మేయర్ కారుకు నిప్పుపెట్టారు. By Trinath 03 Jul 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఫ్రాన్స్ నిత్యం నిరసనలతో అట్టుడికే దేశం. తలవంచడమే కానీ.. తలదించడం తెలియని పౌరులు అక్కడుంటారు. అందుకే అధ్యక్ష పీఠంపై ఎవరెక్కినా ప్రజలు లెక్క చేయరు. తప్పుంటే ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. తాడోపెడో తేల్చుకుంటారు. మరోసారి అదే చేస్తున్నారు. జూన్ 27న జరిగిన 17 ఏళ్ల టీనేజర్ మరణం ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. నహెల్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఆఫ్రికాలోని అల్జీరియా నుంచి వలస వచ్చిన కుటుంబం నహెల్‌ది. ఇది జాత్యహంకార కాల్పులుగా ప్రజలు భగ్గమంటున్నారు. పారిస్, మార్సెయిల్, లియాన్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేలాది మంది యువకులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. పారిస్ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రన్ ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. కారుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మేయర్ భార్య, వాళ్ల పిల్లాడికి గాయాలయ్యాయి. టీనేజర్లు, యువకులే ఎక్కువ: ఇంతింతై వటుడింతై అన్నట్టు.. ఫ్రాన్స్‌లో మొదలైన నిరసనలు చినికిచినికి గాలివానలా మారాయి. ఇది ఎక్కడకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. నిరసనలు చేస్తున్న వాళ్లలో ఎక్కువ మంది టీనేజర్లే ఉన్నారు. పోలీసులపై దాడి చేస్తున్నారు. పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. లాభం లేదనుకొని టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రుళ్లు కర్ఫ్యూ విధిస్తున్నారు. 45 వేల మంది పోలీసులు, స్పెషల్ ఎలైట్ యూనిట్లు, ఆయుధాలతో కూడిన వెహికల్స్, హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా పెట్టినప్పటికీ పారిస్, మార్సెయిల్, లియాన్‌లలో అల్లర్లు ఆగడం లేదు. 10 షాపింగ్‌మాల్స్, 200కి పైగా సూపర్‌మార్కెట్లు, 250 టొబాకో షాప్స్, 250 బ్యాంక్ ఔట్లెట్లపై నిరసనకారులు దాడికి దిగి లూటీ చేశారు. గ్రిగ్నిలో కొన్ని ఇళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు ఇప్పటివరకు సుమారు 800 మంది అరెస్ట్ చేశారు. 1,500కి యువకులు పోలీసులు కస్టడీలో ఉన్నారు. FRANCE HAS FALLEN!! More deaths reported overnight in France, cities burnt to the ground, and #Macron still refuses to call in the military. 😡😡. One Firefighter 🔥 killed by Rioters.#FranceRiots #FranceHasFallen #FranceOnFire #Emeute pic.twitter.com/OgfkRBx4iW — Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) July 3, 2023 నీరో చక్రవర్తిలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫిడేల్ వాయిస్తున్నారా..? ఓవైపు దేశం తగలపడిపోతుంటే అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది ఘటన జరిగిన ముందు రోజు నాటి వీడియో అని ప్రభుత్వం చెబుతోంది. పిల్లలు, టీనేజర్లను తల్లిదండ్రులు ఇళ్లలో నుంచి బయటకు పంపించవద్దని మాక్రాన్ విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ఓవైపు నిరసనలు జరుగుతుంటే మరోవైపు దోపిడీ దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. కనిపించిన షాపుల్లో దూరిపోయి అక్కడి వస్తువులను చోరీ చేస్తున్నారు. ఐఫోన్లు కూడా దొంగిలించినట్లు సమాచారం. చేస్తుంది దోపిడీలు అయినా.. ఏదో ఘనకార్యం అన్నట్టు వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలా దొంగలు, నిరసనకారులతో పోలీసులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరికొన్ని ప్రాణాలు పోయే ప్రమాదముంది. చైనా టూరిస్ట్ బస్సుపై దాడి: అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు మాక్రాన్ తన జర్మనీ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు జర్మనీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అల్లర్లు వ్యాపించడానికి సోషల్ మీడియా ప్రధాన కారణమని మాక్రాన్ మండిపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వయలెన్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని జస్టిస్ మినిస్టర్ ఎరిక్ హెచ్చరించారు. అటు చైనా టూరిస్ట్ బస్సుపై నిరసనకారులు దాడి చేయడం అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న తమ పౌరులకు రక్షణ కల్పించాలని చైనా కాన్సులర్ వ్యవహారాల ఆఫీస్ ఫ్రాన్స్‌ను కోరింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి