/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mayor-Vijaya-Lakshmi.jpg)
Mayor Vijaya Lakshmi: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేపట్టారు. మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీనే ప్రోత్సహించిందని మేయర్ విజయలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా వేశారు మేయర్. కౌన్సిల్ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేశారు.