Mayawati: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి: మాయావతి డిమాండ్ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. ఇటీవలే పలు రాష్ట్రాలు అందుకు అంగీకరించడం, సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మాయావతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. By Naren Kumar 02 Dec 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Mayawati: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. కులగణన నిర్వహించాలని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్లు భారీగా వస్తున్నాయని మాయావతి వెల్లడించారు. ఆ డిమాండ్లతో బీజేపీ నిద్రలేని రాత్రులు గడుపుతోందని విమర్శించారు. ఇది కూడా చదవండి: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. అది నిజమేనా?! దేశవ్యాప్తంగా సరైన ప్రక్రియను అనుసరించి కులగణన చేపట్టడం ద్వారా ప్రజలందరికీ రావాల్సిన హక్కులను సమానంగా లభించేలా చూడాలని మాయావతి అన్నారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 4న ప్రారంభమై 22వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ అంశంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందో లేదో వేచిచూడాల్సి ఉంది. 1. संसद के आगामी 4 दिसम्बर से शुरू हो रहे शीतकालीन सत्र से पहले आज सर्वदलीय बैठक में बीएसपी द्वारा सरकार से देश में जातीय जनगणना कराए जाने की माँग पुनः की गयी। अब जबकि इसकी माँग देश के कोने-कोने से उठ रही है, केन्द्र सरकार द्वारा इस बारे में अविलम्ब सकारात्मक कदम उठाना जरूरी। — Mayawati (@Mayawati) December 2, 2023 #mayawati #caste-census మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి