Rajouri Fire: LOC సమీపంలో భారీ అగ్నిప్రమాదం, మందుపాతరలో పేలుళ్లు..!!

పూంచ్ జిల్లాలోని బాల్నోయ్, కృష్ణా ఘాటి సెక్టార్లలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టేందుకు వేసిన మందుపాతరలపైకి మంటలు చెలరేగాయి. మంటల కారణంగా నిరంతరం పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.

New Update
Rajouri Fire: LOC సమీపంలో భారీ అగ్నిప్రమాదం, మందుపాతరలో పేలుళ్లు..!!

Rajouri Fire: పూంచ్ జిల్లాలోని బాల్నోయ్, కృష్ణా ఘాటి సెక్టార్లలో నియంత్రణ రేఖకు సమీపంలోని శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వేసిన మందుపాతరల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేవు. ఆర్మీ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.సమాచారం ప్రకారం, పూంచ్ జిల్లాలోని బాల్నోయి, కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు భారీ రూపం దాల్చి వేగంగా వ్యాపించాయి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ మైనార్టీలపై పగ పట్టింది: కేటీఆర్

ఈ అగ్నిప్రమాదం కారణంగా సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు అమర్చిన మందుపాతరలు కూడా పేలడం ప్రారంభించాయి. అదే సమయంలో ఆర్మీ జవాన్లు, ఆర్మీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే పనిని ప్రారంభించారు.రెస్య్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు.

Advertisment
తాజా కథనాలు