Maruti Suzuki beats Mahindra: భారతీయ SUV మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. తాజాగా మారుతీ సుజుకీ (Maruti Suzuki) అమ్మకాల్లో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. అమ్మకాల్లో మారుతీసుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రాను వెనక్కు నెట్టేసింది. మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ (Shashank Srivastava) మాట్లాడుతూ, గత ఆగస్టులో భారతదేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) యొక్క అగ్ర తయారీదారుగా మారుతి సుజుకి అవతరించిందని తెలిపారు. వాహన తయారీ సంస్థ (మారుతి సుజుకీ) గత నెలలో 16.5 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది ఆటోమొబైల్ పరిశ్రమ కంటే వేగంగా ఉందని శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.
ఇది కూడా చదవండి: పిల్లల్లో టైప్ -2 డయాబెటిస్‌కు కారణాలు ఇవే..!!
ఈ పండగ సీజన్‌లో 1 మిలియన్ సేల్స్ మార్కును దాటనున్నామని చెప్పారు. మొత్తం వార్షిక అమ్మకాలలో సాధారణంగా పండుగ సీజన్‌లో 26 శాతం వాటా ఉంటుందన్నారు. నాలుగు కొత్త SUVలను ప్రవేశపెట్టడంతో మారుతి మార్కెట్ వాటా పెరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది ఓనం సీజన్‌లో కేరళలో రిటైల్ విక్రయాల్లో 25 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసుకున్నామని ఆయన చెప్పారు.
గత సంవత్సరం మొత్తం ఆటో పరిశ్రమలో 35 శాతం నుండి చిన్న కార్ల విభాగం 30 శాతానికి తగ్గిందని, అయితే SUV సెగ్మెంట్ బాగా వృద్ధి చెందుతోందని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 29 శాతంగా ఉన్న మొత్తం మార్కెట్ వాటాలో ఇప్పుడు SUVలు 49 శాతం వాటా కలిగి ఉన్నాయని శశాంక్ చెప్పారు. ఆగస్టులో మారుతీ సుజుకి మొత్తం 189,082 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్‌లో 1,58,678 యూనిట్లు విక్రయించగా, 24,614 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. మహీంద్రా (Mahindra) అమ్మకాల గురించి మాట్లాడుతూ, ఆగస్టులో కంపెనీ మొత్తం 70,350 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వీటిలో ఎగుమతి చేసిన వాహనాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: బరువు తగ్గాలంటే..ఈ సలాడ్స్ మీ డైట్లో చేర్చుకోండి..కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..!!