దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ పెద్ద సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తోంది. దాదాపు 87వేలకు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎస్ ప్రెస్సో, ఈకో మోడళ్లకు చెందిన 87, 599 యూనిట్లను వెనక్కు రప్పిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. లోపభూయిష్టమైన స్టీరింగ్ టై రాడ్‌లను సరిచేసేందుకు గానూ రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. వాహన తయారీ సంస్థ జూలై 5, 2021 నుంచి ఫిబ్రవరి 15, 2023 మధ్య తయారు చేసిన S-ప్రెస్సో, ఈకో మోడల్‌లలో 87,599 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మారుతీ సుజుకి ఒక పత్రికా ప్రకటనలో, "ఈ వాహనాలలో ఉపయోగించే స్టీరింగ్ టై రాడ్‌లో ఒక భాగంలో లోపం ఉందని గుర్తించాం, ఇది కొన్ని అరుదైన సందర్భాల్లో, వాహనం యొక్క డ్రైవబిలిటీ, హ్యాండ్లింగ్‌ను దెబ్బతీస్తుంది . ఈ లోపం వల్ల స్టీరింగ్ కంట్రోల్ తప్పే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ డీలర్ల నుంచి వినియోగదారులకు వ్యక్తిగత సమాచారం అందిస్తారని తెలిపారు. వాహనాన్ని చెక్ చేసి ఏదైనా లోపం ఉన్నట్లయితే వెంటనే సరిచేస్తామని, రీప్లేస్ మెంట్ ఫ్రీ అని కంపెనీ పేర్కొంది. జూలై 24 నుంచి ఈ రీకాల్ ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ మధ్య ఓ కంపెనీ ఈ స్థాయిలో వాహనాలను రీకాల్ చేయడం ఇదే మొదటిసారి. సోమవారం నాటి ట్రెండింగ్ లో మారుతీ సుజుకీ షేర్లు BSEలో 0.75శాతం క్షిణించాయి. రూ. 9,694.70వద్ద ముగిశాయి.
మారుతీ ఎస్-ప్రెస్సో:
మారుతీ 2019లో ఎస్-ప్రెస్సోను ప్రారంభించింది. ఐడిల్-స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కొత్త వెర్షన్, 25.3 kmpl మైలేజీని గతేడాది విడుదల చేసింది. మోడల్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ , AGS వేరియంట్‌లో హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లు ఈ కారులోఉన్నాయి.
మారుతి సుజుకి ఈకో:
మారుతి సుజుకి కూడా 2022లో రూ. 5.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఈకో ఎమ్‌పివి యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. కొత్త Eeco 13 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఇందులో 5-సీటర్ కాన్ఫిగరేషన్, 7-సీటర్ కాన్ఫిగరేషన్, కార్గో, టూర్, అంబులెన్స్ వెర్షన్‌లు ఉన్నాయి.