Maruti Cars Recall: మీది మారుతీ కారా? కంపెనీ వేలాది కార్లను వెనక్కి తీసుకుంటోంది.. మీదుందేమో?

భారత దేశపు అతిపెద్ద కార్ల కంపెనీ  మారుతి 17 వేల కార్లను రీకాల్ చేస్తోంది. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారైన బాలెనో, వ్యాగన్ఆర్ ఇంధన పంపు మోటార్‌లో సమస్య ఉంది. ఈ కార్లలో మీకారు ఉందేమో టైటిల్ పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోండి.

New Update
Maruti Cars Recall: మీది మారుతీ కారా? కంపెనీ వేలాది కార్లను వెనక్కి తీసుకుంటోంది.. మీదుందేమో?

Maruti Cars Recall: భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు మారుతీ సుజుకీ ఇంజన్ వైఫల్యం కారణంగా 16 వేల కార్లను రీకాల్ చేసింది. కంపెనీ ప్రకారం, బాలెనో, వ్యాగన్ఆర్ ఇంధన పంపు మోటార్‌లో సమస్య ఉంది. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో,  4,190 యూనిట్ల వ్యాగన్ఆర్‌లను కంపెనీ రీకాల్(Maruti Cars Recall) చేస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ వాహనాల ఫ్యూయల్ పంప్ మోటారులో ఒక భాగంలో లోపం ఉండే అవకాశం ఉంది. దీని వల్ల ఇంజిన్ ఆగిపోవచ్చు లేదా ఇంజిన్ స్టార్ట్ చేయడంలో సమస్య ఉండవచ్చు.

కారును ఉచితంగా రిపేరు చేసిస్తాం..
ఈ మోడళ్ల కార్లలో ఏదైనా కారును కలిగి ఉన్న వినియోగదారుడు తమ దగ్గరలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి అవసరమైన మరమ్మతులు చేయించుకోవాలని కంపెనీ ప్రకటించింది. కంపెనీ ప్రకటన ప్రకారం, మీ కారు ఈ రీకాల్‌(Maruti Cars Recall)లో భాగమైతే, మీ కారు భాగాలను కంపెనీ ఉచితంగా భర్తీ చేస్తుంది.

మీ కారును ఇలా చెక్ చేసుకోండి..
మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు రీకాల్(Maruti Cars Recall) చేసిన  కార్ల గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ కారు వివరాలను కూడా చెక్ చేయవచ్చు . మారుతి బాలెనో, వ్యాగన్‌ఆర్‌లను రీకాల్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.  ఇప్పుడు ఇక్కడ మీరు మీ కారు ఛాసిస్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. మీ కారులో ఏదైనా లోపం ఉంటే అలాగే, దానిని రిపేర్ చేయవలసి వస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది.

Also Read: హ్యుందాయ్ వేలాది కార్లను రీకాల్ చేస్తోంది! ఆ కార్లలో మీ కారు ఉందా?

గతేడాది కూడా 7,213 బాలెనోల రీకాల్..
గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ 7,213 యూనిట్ల మారుతీ బాలెనో ఆర్‌ఎస్ (పెట్రోల్)ను రీకాల్(Maruti Cars Recall) చేసింది. ఈ కార్లు అక్టోబర్ 27, 2016 మరియు నవంబర్ 1, 2019 మధ్య తయారు చేయబడ్డాయి. వారి వాక్యూమ్ పంప్‌లో లోపం కనుగొన్నారు.  దీని కారణంగా బ్రేకింగ్‌లో ఇబ్బంది ఉండవచ్చు. అందుకే ఆ కార్లను కంపెనీ రీకాల్ చేసింది. 

ఇటీవల హ్యుందాయ్ కూడా..
సాంకేతిక లోపం కారణంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా  దేశంలో 7698 వాహనాలను రీకాల్ చేసింది. ఈ రీకాల్‌లో సెడాన్ సెగ్మెంట్ నుండి కంపెనీ ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) క్రెటా అలాగే, వెర్నా కూడా ఉన్నాయి. రెండు కార్లలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో కూడిన CVT ఆటోమేటిక్ వేరియంట్‌లను మాత్రమే కంపెనీ రీకాల్ చేసింది. హ్యుందాయ్ ఈ రీకాల్ గురించి రోడ్డు రవాణా – రహదారుల మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. క్రెటా – వెర్నా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్ తప్పుగా ఉండవచ్చని హ్యుందాయ్ తెలిపింది. ఇది CVT గేర్‌బాక్స్‌లోని ఎలక్ట్రానిక్ ఇంధన పంపు పనితీరును ప్రభావితం చేయవచ్చు అని చెబుతున్నారు. ఈ రీకాల్‌లో గత సంవత్సరం ఫిబ్రవరి 13, 2023, జూన్ 06, 2023 మధ్య తయారయిన రెండు కార్లలోని 7,698 యూనిట్లు ఉన్నాయి. వాహన రీకాల్‌(Vehicle Recall)పై స్వచ్ఛంద కోడ్ ప్రకారం ఈ చర్య తీసుకున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు