Vehicle Recall: సాంకేతిక లోపం కారణంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశంలో 7698 వాహనాలను రీకాల్ చేసింది. ఈ రీకాల్‌లో సెడాన్ సెగ్మెంట్ నుండి కంపెనీ ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) క్రెటా అలాగే, వెర్నా కూడా ఉన్నాయి. రెండు కార్లలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లతో కూడిన CVT ఆటోమేటిక్ వేరియంట్లను మాత్రమే కంపెనీ రీకాల్ చేసింది. హ్యుందాయ్ ఈ రీకాల్ గురించి రోడ్డు రవాణా – రహదారుల మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. క్రెటా – వెర్నా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్ తప్పుగా ఉండవచ్చని హ్యుందాయ్ తెలిపింది. ఇది CVT గేర్‌బాక్స్‌లోని ఎలక్ట్రానిక్ ఇంధన పంపు పనితీరును ప్రభావితం చేయవచ్చు అని చెబుతున్నారు. ఈ రీకాల్‌లో గత సంవత్సరం ఫిబ్రవరి 13, 2023, జూన్ 06, 2023 మధ్య తయారయిన రెండు కార్లలోని 7,698 యూనిట్లు ఉన్నాయి. వాహన రీకాల్(Vehicle Recall)పై స్వచ్ఛంద కోడ్ ప్రకారం ఈ చర్య తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Vehicle Recall: హ్యుందాయ్ వేలాది కార్లను రీకాల్ చేస్తోంది! ఆ కార్లలో మీ కారు ఉందా?
ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్ తప్పుగా ఉండవచ్చనే కారణంతో హ్యుందాయ్ 7698 కార్లను రీకాల్ చేస్తోంది. ఫిబ్రవరి 13, 2023-జూన్ 06, 2023 సంవత్సరాల మధ్యలో తయారైన క్రెటా, వెర్నా మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది హ్యుందాయ్.
Translate this News: