సూసైడ్ కు ప్రేరేపిస్తున్న గంజాయి మత్తు..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

గంజాయి మత్తుకు యువత, విద్యార్థులు బానిసవుతున్నారు.అయితే తాజా అధ్యయనంలో గంజాయి ఎక్కువగా తీసుకుంటున్న వారిలో సైకోసిస్ అనే సమస్య తలెత్తుతుందని తాజా అధ్యయనం తెలిపింది. దీని కారణంగా వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.

New Update
సూసైడ్ కు ప్రేరేపిస్తున్న గంజాయి మత్తు..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

గంజాయి మత్తుకు యువత, విద్యార్థులు బానిసవుతున్నారు.గంజాయిని  ప్రభుత్వాలు నిషేదించిన కొందరు వ్యక్తులు అక్రమంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే తెలుసో.. తెలియకో.. మత్తు కావాలనుకునేవారు ఈ గంజాయిని ఉపయోగించి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారని తాజా అధ్యయనం తెలిపింది.

ఔషధ గుణాలు కలిగిన గంజాయి దీర్ఘకాలిక నొప్పి నుంచి ఉపశమనం, నాణ్యమైన జీవిత ప్రయోజనాలను అందిస్తుందని పలు అధ్యయనాలు సూచించాయి. కానీ దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణాంతక సమస్యలు కూడా కలుగుతాయని తెలిపాయి. ఈ విషయాన్ని విస్మరించి.. కొందరు విచ్చలవిడిగా గంజాయి వినియోగిస్తున్నారు. అలాంటివారికి తాజా అధ్యయనం షాక్ ఇచ్చింది.ఈ అధ్యయనం గురించి సైకియాట్రీ రీసెర్చ్ కేస్ రిపోర్ట్స్ జర్నర్​లో ప్రచురించారు. ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్న, స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్​తో 27 ఏళ్ల మహిళ దీర్ఘకాలిక నొప్పితో కూడిన నాడీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుంది.

ఈ సమస్యపై పరిశోధకులు స్టడీ చేశారు. అయితే ఈ మహిళ తన నొప్పిని తగ్గించుకునేందుకు గంజాయి తీసుకునేది. ఈ డోస్ రోజు రోజుకి పెరిగిపోవడంతో పరిస్థితి విషమించింది. మెంటల్​గా డిస్టర్బై.. తీవ్ర అలసట, నిద్ర సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు, తీవ్రమైన మానసిక ఇబ్బందులతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ సైకోసిస్​లో భాగమేనని చెప్తున్నారు.గంజాయి వినియోగం వల్ల జంక్ ఫుడ్ కోరికలు, గణనీయంగా బరువు పెరగడం, ఆందోళన, భయభ్రాంతులు కలగడం వంటి కూడా ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. అయితే ప్రస్తుత అధ్యయనం నొప్పి నుంచి ఉపశమనం గంజాయిని తీసుకునేవారికి హెచ్చరికగా మారింది. దీర్ఘకాలిక నొప్పి చికిత్సలో గంజాయి ఉపశమనం ఇస్తుంది కానీ.. మోతాదుకి మించి తీసుకుంటే సమస్య తీవ్రమై.. ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా సైకోసిస్ అనే మానసిక ఆరోగ్యానికి గురించేస్తుందని మానసిక వైద్యులు చెప్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు