Maoist Party Letter : ప్రజాగాయకుడు గద్దర్ మృతిపై భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) స్పందించింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ప్రకటన విడుదల చేసింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరని పేర్కొంది. గద్దర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపింది. నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారంది. పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్యపరిచారని చెప్పింది. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉందంది.1972 నుంచి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగిందని వెల్లడించింది. నాలుగు దశబ్దాల పాటు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డారంది.
గద్దర్ నాలుగేళ్ల పాటు అజ్ఞాత జీవితాన్ని కొనసాగించారని ఆ లేఖలో పేర్కొంది. అయితే ఆయన అవసరాన్ని గుర్తించి తాము అజ్ఞాతం నుండి బయటకు పంపించినట్లు తెలిపింది. ఆ తర్వాత గద్దర్ చేత జనచైతన్య మండలిని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చామని తెలిపింది. 2012 వరకు పీడీత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తర్వాత పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారని వెల్లడించింది. ఇతర పార్టీలతో కలిసినందుకు షోకాజ్ నోటీసు ఇచ్చామని గుర్తు చేసింది. అదే సంవత్సరం పార్టీకి రాజీనామా చేశారని, దానిని తాము ఆమోదించామని వెల్లడించింది.
1972 నుండి 2012 మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగారని తెలిపింది. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశారని గుర్తుచేసింది. దోపిడి పాలకుల బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించారంది. సాంస్కృతి రంగం అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసిందని పేర్కొంది. 1997లో గద్దర్‌పై నల్లదండు ముఠా, పోలీసులు కలిసి కాల్పులు చేశారని.. ఐదు తూటాలు శారీరంలో దూసుకెళ్లి ప్రాణ ప్రాయ స్థితి నుండి బయట పడారంది. ఆయన చివరి కాలంలో పార్టీ నింబంధనావళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలువడంతో షోకాజ్ నోటీస్ ఇచ్చామని వెల్లడించింది. అదే సంవత్సరం పార్టీకి రాజీనామా చేశారని, దానిని తాము ఆమోదించామని వెల్లడించింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరు మీద ఈ లేఖ విడులైంది.
మరోవైపు అశ్రునయనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన అంతిమయాత్ర ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ చేరుకుంది. విప్లవకారులు, గాయకులు, కళాకారులు, సాధారణ ప్రజలు దారి పొడవునా గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
Also Read: అశ్రునయనాల మధ్య గద్దర్ అంతిమయాత్ర