303 రైఫిల్స్, 11 SMBL,15 హ్యండ్ గ్రానెడ్లు, 51 MM మోర్టార్ బాంబులతో మావోయిస్ట్ డంప్ స్వాధీనం..తీవ్ర కలకలం!!

మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో 303 రైఫిల్, 11 ఎస్ఎంబీఎల్, 303 రైఫిల్ మ్యాగజీన్, మూడు నాటు తుపాకులు, రెండు 51 ఎంఎం మోర్టార్ బాంబులు, 15 హ్యాండ్ గ్రానెడ్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు,5 ప్యాకెట్ల అమ్మోనియం నైట్రేట్, గ్యాస్ వెల్డింగ్ మిషన్, 42 బుల్లెట్లు, ఒక రాకెట్ లాంచర్,29 జిలెటిన్ స్టిక్స్.. దొరికాయి.

303 రైఫిల్స్, 11 SMBL,15 హ్యండ్ గ్రానెడ్లు, 51 MM మోర్టార్ బాంబులతో మావోయిస్ట్ డంప్ స్వాధీనం..తీవ్ర కలకలం!!
New Update

మళ్లీ మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోందా.. అంటే వరుసగా అన్నలు విడుదల చేస్తున్న కరపత్రాలు, పోస్టర్లు, లేఖలతో పాటు బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకుంటున్న మారణాయుధాలు అవుననే అంటున్నాయి. తాజగా మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

అందులో 303 రైఫిల్, 11 ఎస్ఎంబీఎల్, 303 రైఫిల్ మ్యాగజీన్, మూడు నాటు తుపాకులు, రెండు 51 ఎంఎం మోర్టార్ బాంబులు, 15 హ్యాండ్ గ్రానెడ్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు,5 ప్యాకెట్ల అమ్మోనియం నైట్రేట్, గ్యాస్ వెల్డింగ్ మిషన్, 42 బుల్లెట్లు, ఒక రాకెట్ లాంచర్,29 జిలెటిన్ స్టిక్స్.. దొరికాయి.

అయితే ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని 142 బెటాలియన్ బీఎస్ఎఫ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. ఈ క్రమంలో బలగాలు మావోయిస్టులను వెతుక్కుంటూ అడవిలో కూబింగ్ నిర్వహించారు. కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్కనూరు గ్రామానికి కొంచెం దూరంలో తనిఖీలు చేస్తున్న బీఎస్ఎఫ్ బలగాలకు భారీ డంప్ కనిపించింది. దీంతో ఆ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న బలగాలు మావోయిస్టుల కోసం ముమ్మరంగా కూబింగ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. మరోసారి తెలంగాణలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. దున్నేవాడికే భూమి అనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ కరపత్రాల్లో మావోయిస్ట్ అన్నలు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా చర్లలో ఈ కరపత్రాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయాలని మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఈ కరపత్రాలున్నాయి.

దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా, స్థానికంగా ఉండే బీఆర్ఎస్, బీజేపీ నేతల్లో దీంతో గుబులు మొదలైంది. అయితే ముందు నుంచి ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా ఉన్న మావోయిస్టులు అప్పుడప్పుడు కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేసి అధికార పక్షంలో ఆందోళనను కల్గిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి