బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో ట్రై చేస్తుంటారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. దానికి వర్కౌట్ చేయడంతో పాటు డైట్ కూడా ముఖ్యమే. దీంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి. అలాంటప్పుడు నిమ్మతొక్క, అల్లంతో తయారుచేసిన డ్రింక్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.
నిమ్మలో ఎన్నో గుణాలు ఉన్నాయి. దాని తొక్కలో కూడా అద్భుత గుణాలు ఉన్నాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జీవక్రియని పెంచుతాయి. దీని వల్ల కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది. ఇందులో వైరామిన్ సి సహా అనేక పోషకాలు కూడా ఉన్నాయి.ఈ ప్రత్యేకమైన డ్రింక్ చేయడానికి ఓ గ్లాసు లేదా రెండు గ్లాసు నీటిలో నిమ్మతొక్క, అల్లం తురుము వేసి కలిపి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తాగాలి. వీటిని నిమ్మ తొక్కలు, అల్లం ఎండబెట్టి కూడా స్టోర్ చేసి పొడిలా చేయాలి. దీనిని రోజుకి కాస్తా పొడి వేసి మరిగించి త్రాగాలి.
బరువు తగ్గించడంలో అల్లం కూడా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇది జీర్ణక్రియని పెంచి కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది. అల్లంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాదు. జీవక్రియని పెంచుతుంది. జీర్ణప్రక్రియని బలంగా చేస్తుంది. ట్యాక్సిన్స్ తొలగించడం ద్వారా బరువు తగ్గడానికి ఇది మంచిది.