గుండెపోటు వస్తే నొప్పి ఎలా ఉంటుందో తెలుసా..?

చాలామంది గుండె నొప్పి, ఎసిడిటీ వల్ల కలిగే మంటకు తేడాలు గుర్తించలేరు. అప్పుడప్పుడు యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఛాతీలో నొప్పి, మంట రావచ్చు. ఈ రెండింటి లక్షణాల మధ్య తేడా ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

New Update
గుండెపోటు వస్తే నొప్పి ఎలా ఉంటుందో తెలుసా..?

Cardiac Vs Gastric:  గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు.

చాలా మంది తమకు రోగనిరోధకశక్తి ఎక్కువని, ఛాతీలో వచ్చే మంటని కొన్ని సెకన్లలో మందులతో నయం చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. హార్ట్ బర్న్ వంటి లక్షణాలు గుండెపోటు ప్రారంభ సంకేతాలు కూడా కావచ్చు.అలాంటప్పుడు మీరు గ్యాస్ట్రిక్ మందులు తీసుకుంటే ఉపయోగం ఉండదు. అందుకే ఈ రెండు సమస్యలకు వేర్వేరు లక్షణాలు ఉంటాయి.

ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది. చేయి, దవడ, మెడ లేదా వీపులో నొప్పి ప్రారంభమవుతుంది. శరీరమంతా చెమటలు పోస్తాయి. గుండెల్లో మంట, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. వికారం లేదా వాంతులు ఉంటాయి, అసాధారణ అలసటగా ఉంటుంది.

గుండెపోటు లక్షణాలు మహిళలు వేర్వేరుగా ఉండవచ్చు. వీరికి తీవ్రమైన ఛాతీ నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం ఉండకపోవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం లేదా వాంతులు, వెన్ను లేదా దవడ నొప్పి, మైకం, తలతిరగడం, దిగువ ఛాతీ లేదా పైభాగంలో నొప్పి లేదా విపరీతమైన అలసట వంటి అస్పష్టమైన లక్షణాలు కనిపించవచ్చు.

Also Read: తండ్రిని మించిన తనయురాలు.. మనసుకు హత్తుకున్న దృశ్యం

Advertisment
తాజా కథనాలు