Urad Dal: ముఖానికి నల్ల మినపప్పుతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా ఉపయోగించండి! మినపప్పు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. మినపప్పు, పసుపు, పెరుగును కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల ముఖం అందంగా మారుతుంది. ఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. By Vijaya Nimma 14 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Urad Dal: చర్మ సంరక్షణ, ముఖాన్ని మెరిసేలా, అందంగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కొందరు వ్యక్తులు వైద్య చికిత్స, ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగిస్తారు. అయినా ముఖం మీద మచ్చలు, మొటిమలను తగ్గక ఇబ్బంది పడుతారు. హోం రెమెడీని అనుసరించడం ద్వారా ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. అలాంటి వాటిల్లో నల్ల మినపప్పు ఒకటి. ఇది ముఖానికి చేసే ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు. దీనిని ఉరద్ పప్పు అని కూడా అంటారు. ఈ మినపప్పు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు గురించి తెలుసుకుందాం. మినపప్పు వల్ల ముఖానికి కలిగే ప్రయోజనాలు: మినపప్పు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది సహజమైన ముఖాన్ని అందంగా మారుస్తుంది. ఈ పప్పులో ఉండే అనేక పోషకాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరచి మెరిసేలా చేస్తుంది. మినపప్పు నుంచి ఫేస్ ప్యాక్ చేయడానికి పప్పును రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. మినపప్పు, పెరుగుతో కూడిన ఫేస్ ప్యాక్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఉదయం రాత్రంతా నానబెట్టిన నల్ల మినపప్పును గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌లో పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత ముఖం కడగాలి. మినపప్పులో పసుపు కలిపి పేస్ట్‌ని ముఖానికి పట్టించాలి. ఈ పప్పును గ్రైండ్ చేసిన పేస్ట్‌లో శెనగపిండిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇంట్లో మినపప్పు స్క్రబ్ కోసం ఉడకబెట్టిన పప్పును మెత్తగా పెస్ట్ చేయాలి. ఈ పెస్ట్‌లో కొద్దిగా చక్కెరను రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి చేతులతో మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌లన్నింటినీ ఉపయోగిస్తే ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి. ఈ పప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని బిగుతుగా ఉంచి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్యాచ్ టెస్ట్: మినపప్పును ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే కొందరికి దీని నుంచి సమస్యలు రావచ్చు. పొడి చర్మం ఉన్నవారు వారానికి రెండుసార్లు స్క్రబ్, ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారైతే వారానికి మూడు సార్లు ఫేస్ ప్యాక్, స్క్రబ్ వేసుకోవాలని చర్మ నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #urad-dal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి