Finger : వేలిని బట్టి మనిషి తెలివితేటలు అంచనా వేయొచ్చా? ఒకరి తెలివితేటలతో పాటు వారి వ్యక్తిత్వాన్ని వేళ్ల సైజును బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పెద్దదిగా ఉంటే మంచి వ్యక్తి అని అర్థం. అలాగే మంచి తెలివితేటలు, జ్ఞానంతో పాటు జీవితంలో మంచి లక్ష్యాన్ని కలిగి ఉంటారట. అయితే దీనికి శాస్త్రియ ఆధారాలు లేవు. By Vijaya Nimma 14 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Finger Tips : మనం ఎవరినైనా చూసినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో కొన్నిసార్లు చెప్పలేము. అందరి సైకాలజీ, తెలివితేటలు(Intelligence) ఒకే విధంగా ఉండవు. అయితే ఒక వ్యక్తి వేళ్ల పరిమాణాన్ని బట్టి అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం ఒకరి తెలివితేటలతో పాటు వారి వ్యక్తిత్వాన్ని వేళ్ల సైజు(Finger Size) ను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పొడవుగా ఉంటే: ఉంగరపు వేలు(Ring Finger) కంటే చూపుడు వేలు(Index Finger) పెద్దదిగా ఉంటే మంచి వ్యక్తి అని అర్థం. అలాగే మంచి తెలివితేటలు, జ్ఞానంతో పాటు జీవితంలో మంచి లక్ష్యాన్ని కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా సమానంగా చూస్తారని అంటున్నారు. అలాగే ఇతరులను విమర్శిస్తారని, సలహాలు కూడా ఇస్తారని చెబుతున్నారు. నాయకత్వ వైఖరితో పాటు, జాగ్రత్తగా వ్యవహరిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొందరి చూపుడు వేలు, ఉంగరం వేలు ఒకే సైజులో ఉంటాయి. అలా ఉంటే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడబోరని, అందరినీ సమానంగా చూస్తారని చెబుతున్నారు. ఇతరుల భావాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఎప్పుడూ శాంతియుతంగా ఉంటారు. చూపుడు వేలు ఉంగరపు వేలు కంటే పెద్దగా ఉంటే: కొంతమందికి చూపుడు వేలు కంటే ఉంగరపు వేలు పెద్దదిగా ఉంటుంది. వారు చాలా తెలివైనవారు. ఏ సమస్య వచ్చినా చాలా క్రమపద్ధతిలో పరిష్కరించుకుంటారు. ఎలాంటి సంక్షోభం వచ్చినా ధైర్యంగా ఉంటారని చెబుతున్నారు. అలాగే ఓపికగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తారని చెబుతున్నారు. అంతేకాకుండా వ్యూహాత్మకంగా విషయాలను పరిష్కరించుకుంటారని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి : చిలుకల నుంచి సోకుతున్న జ్వరం.. జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం గల్లంతే! గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #ring-finger #intelligence #mans #index-finger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి