Revanth Reddy: మద్యం మత్తు వదల్చాలి రేవంత్​సర్కారు!

బీఆర్ఎస్ పాలనలో గల్లీ గల్లీకి వైన్స్, బెల్ట్ షాపులు తెరిచి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరని మహిళలు ఆనాడు మండిపడ్డారు. మరి రేవంత్‌రెడ్డి దీనికి చెక్‌ పెడతారా? ఈ విషయంపై తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు అందించే విశ్లేషణ కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Revanth Reddy: మద్యం మత్తు వదల్చాలి రేవంత్​సర్కారు!

మద్యం మత్తులో యువత చిత్తవుతున్నది. చిన్న వయసులోనే భర్త దూరమైన వారెందరో! తాగు… ఊగు… జోగు… సావు అన్నట్టు గత ప్రభుత్వ హయాంలో సాగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తదో! మద్యాన్ని ఎలా అరికడుతుందో వేచి చూడాల్సి ఉన్నది. మత్తు పదార్థాల వినియోగాన్ని పోనుపోను నిరుత్సాహపరుస్తూ, ఆరోగ్యభారతానికి బాటలు పరవడం పాలకుల విధ్యుక్తధర్మంగా 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. దాన్ని తుంగలో తొక్కుతూ ఊరూవాడా మద్యపుటేర్లను గత ప్రభుత్వం పారించింది. సర్కారీ విధానాలతో సామాజిక సంక్షోభం కమ్ముకుంటోంది. ఇంటి పెద్దల తాగుడు వ్యసనం. దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలను పేదరికంలోకి నెట్టి… దరిద్రపు ఊబిలోకి నెట్టుకుపోతోంది. తండ్రుల హఠాన్మరణంతో కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకుంటున్న పిల్లలు అనివార్యంగా దూరమవుతున్నారు. వారిలో అత్యధికులు క్రమేణా మత్తుకు బానిసలుగా బానిసలుగా మారి చదువులకు దూరమవుతున్నారు . పరిధులు దాటిన సురాసేవనంతో తీవ్ర అనారోగ్యం పాలై కట్టుకున్న భార్యలు, కడుపున పుట్టిన బిడ్డలను అనాథలుగా మిగిల్చి యుక్తవయసులోనే కన్నుమూస్తున్నారు. మద్యం కారణంగా ఇండియాలో సంవత్సరానికి 2.60 లక్షల ప్రాణాలు అర్ధాంతరంగా కడతేరిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ప్రకటించింది. ఆ మహమ్మారితో వచ్చే రోగాలు, దాని మూలంగా చోటుచేసుకునే రహదారి ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటివాటితో భారతదేశంలో ఏటా అయిదు లక్షల మందికి పైగా అసువులు బాస్తున్నారని అంతర్జాతీయ వ్యాధిభార (జీబీడీఆర్) నివేదిక లోగడ లెక్కకట్టింది. సమాజ శ్రేయస్సుకు హానికరమైన మద్యం క్రయవిక్రయాలు నూరుశాతం అర్హమైనవని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంచేసింది. ఆ హితోక్తిని పెడచెవిన పెడుతూ ప్రత్యేక విధానాలు, సృజనాత్మక పద్ధతులతో ఆ అనైతిక వ్యాపారాన్ని జోరుగా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు- సంక్షేమ రాజ్యభావనకు సమాధి కడుతున్నాయి.

దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న లిక్కర్లో 45 శాతం వాటా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలదేనని పలు అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి మరీ ప్రభుత్వాలు మధ్యాదాయ మత్తులో జోగుతున్నాయి. 2018-19లో ఎక్సెజ్ రాబడులు రూపేణా జనావళి నుంచి రూ.1.50 లక్షల కోట్లను పిండుకున్న రాష్ట్రాలు, 2019-20లో అంతకు 16శాతానికి పైగా ఆర్జించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుడు యాభై వేల కోట్ల రూపాయల మేరకు మద్యం అమ్మకాలు పోటెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో గడచిన ఆరేళ్లలో మద్యపాన ప్రియులు వెచ్చించిన మొత్తం... అక్షరాలా రూ.1.24 లక్షల కోట్లు! నిరుడు మొదటి ఎనిమిది నెలల్లోనే ఏపీ సర్కారు మద్యం ద్వారా రూ.14 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టుకొన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. లిక్కర్ వినియోగం, అక్రమ రవాణాలను అరికట్టేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ధరలను తగ్గించిన దరిమిలా విక్రయాలు ఇరవై శాతం ఎగబాకినట్లు కథనాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 15 ఏళ్లకు పైబడిన స్త్రీ పురుషుల్లో 20 శాతం దాకా మద్యానికి బానిసలైనట్లు నిర్ధారిస్తున్న అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాగుడుతో కుటుంబాల వైద్యవ్యయ భారం ఇబ్బడిముబ్బడై, ఉత్పాదకత కోసుకుపోయి 2011-50 మధ్య ఇండియా రూ.97.89 లక్షల కోట్లను కోల్పోనుందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో చిన్న వయసులోనే తోడును కోల్పోయి మహిళలు దిక్కులేనివారవుతున్నారు. కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడతున్నారు. గత కొన్నేండ్ల నుంచి చూస్తే లిక్కర్ మత్తులో, యాక్సిడెంట్లలోనే చాలా మందిమహిళల భర్తలు చనిపోయారు. విడో పింఛన్ల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం15.5లక్షల వితంతువులు ఉండగా... అందులో 1,06,641 మంది 35 ఏండ్లలోపు వాళ్లే ఉన్నారు. 40 ఏండ్లలోపు వాళ్లు 2.5 లక్షల మంది వరకు ఉన్నారు. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల కంటే వితంతు పింఛన్లే ఎక్కువ ఇస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. లిక్కర్ను కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో గల్లీ గల్లీకి వైన్స్,బెల్ట్ షాపులు తెరిచి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరని మహిళలు ఆనాడు మండిపడ్డారు. తాగుడుకు బానిసై కొందరు.. మద్యం మత్తులో బండ్లు నడిపి యాక్సిండెట్ల పాలైఇంకొందరు చనిపోతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 40 ఏండ్లలోపు పెండ్లయిన మగవాళ్ల మరణాలకు ప్రధాన కారణాలు లిక్కర్, యాక్సిడెంట్లు, సూసైడ్లు కనిపిస్తున్నాయి. 35% మంది తాగుడుకు బానిసై, ఇతర మత్తు పదార్థాలకు బానిసై చనిపోతుండగా... 45% మంది అనారోగ్య కారణాలు, ఆత్మహత్యలతో కన్నుమూస్తున్నారు. మరో 20% మంది రోడ్డు యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్నారని క్రైం రికార్డ్స్ చెప్తున్నాయి. ఇందులో లిక్కర్ ను. యాక్సిడెంట్లను కంట్రోల్ చేయాల్సిన గత సర్కారు ఆ బాధ్యతను గాలికి వదిలేసింది. యాక్సిడెంట్ల కంట్రోలు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితం కనిపించట్లేదు. రాష్ట్రంలో 2020లో 16,898 యాక్సిడెంట్లలో 6,033 మంది చనిపోతే, గతేడాది 19.248 యాక్సిడెంట్లలో 6,690 మంది కన్నుమూశారు. చనిపోతున్న వాళ్లలో 50 శాతానికి పైగా 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సున్న వాళ్లు ఉన్నారు. 50 నుంచి 60% యాక్సిడెంట్లకు డ్రంక్ అండ్ డ్రైవ్లో కా రణమని పోలీస్ ఇన్వెస్టిగేషన్లలో తేలుతున్నా గత సర్కారు మాత్రం లిక్కర్ కంట్రోల్కు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆబ్కారీ శాఖకు ఏటా సేల్స్ టార్గెట్లు పెంచుతూ, ఖజానా నింపుకుంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో రోజుకు రూ.74 కోట్ల లిక్కర్ అమ్మితే 2021లో అది రూ.82 కోట్లకు చేరింది. లిక్కర్ ద్వారానే సర్కారు గతేడాది రూ.30 వేల కోట్లు సంపాదించింది. ఊరూరా బెల్టు షాపులను ప్రోత్సహిస్తుండడంతో తాగుడుకి బానిసై రోడ్డు యాక్సిడెంట్లలో కొందరు, మత్తులో సూసైడ్స్ చేసుకొని కొందరు ప్రాణాలు వదులుతున్నారు. తాగుడు కారణంగా ఆర్థిక సమస్యలతో సూసైడ్ చేసుకునేవాళ్లు, లివర్ ఫెయిల్యూర్, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్న వాళ్లకూ లెక్కలేదు. కుటుంబ పోషణకు అష్టకష్టాలు

రాష్ట్రంలో ప్రస్తుతం సర్కారు ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ల కంటే వితంతు పింఛన్లే ఎక్కువ ఉంటున్నాయి. 12.05 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తుండగా, 14.50 లక్షల మంది వితంతు పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో 50 ఏండ్లలోపు వయస్సు ఉన్న విడోలు ఏకంగా 5 లక్షల 68 వేల 563 మంది ఉన్నారు. గతంలో కొత్తగా 1,59,482 మంది విడో పింఛన్ల కోసం అప్లయ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేండ్లుగా ఎవరికీ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో వీరంతా ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. ఇక చిన్న వయస్సులో భర్తలను కోల్పోయిన పేద వితంతు కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ఎంత పనిచేసినా బట్ట, పొట్ట వరకే సరిపోతుండడంతోతమకంటూ ఓ గూడు ఏర్పాటు చేసుకోవడం. కష్టంగా మారింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం తీసుకున్న అప్లికేషన్లలో ప్రతి మండలం నుంచి కనీసం 500 నుంచి 1000 అప్లికేషన్లు విడోస్ నుంచే ఉంటున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. తమకు మగ దిక్కులేనందున ఫస్ట్ ప్రయారిటీ కింద డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించాలని వారు రిక్వెస్ట్ చేసినా గత సర్కారు మాత్రం పట్టించుకోలేకపోయిందని నగ్న సత్యం. ఇక కాంగ్రెస్ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ పైన తీసుకున్న కఠినమైన నిర్ణయాలను ప్రజలు అభినందిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు తెరిచి ఆదాయమే పరమావతిగా చూసుకున్న కేసీఆర్ సర్కారు .మహిళలు రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ ఎత్తివేసి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకుండా నియంత్రంగా మద్యాన్ని అమలు చేయడం వల్ల ఆడపిల్లల బతుకులు బాగుపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ మా బతుకులను సరి చేస్తారని... భరోసా ఇస్తారని…మహిళలు కోరుకుంటున్నారు.

మన్నారం నాగరాజు,
తెలంగాణ లోక్ సత్తా పార్టీ,
రాష్ట్ర అధ్యక్షుడు.

Also Read: గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం

Advertisment
Advertisment
తాజా కథనాలు