Manisha Koirala : క్యాన్సర్ అని తెలిసి ఎవరూ పట్టించుకోలేదు, ఒంటరి దాన్ని అయిపోయా - స్టార్ హీరోయిన్ ఆవేదన!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కోయిరాలా తన క్యాన్సర్ రోజులను గుర్తు చేసుకుంది. ఆ టైం లో తనతో ఉన్న స్నేహితులే సంబంధం లేనట్లు వదిలి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.

New Update
Manisha Koirala : క్యాన్సర్ అని తెలిసి ఎవరూ పట్టించుకోలేదు, ఒంటరి దాన్ని అయిపోయా - స్టార్ హీరోయిన్ ఆవేదన!

Actress Manisha Koirala Recalls Her Cancer Days :ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున సరసన 'క్రిమినల్' సినిమాతో తెలుగు వెండితెరకు ఎంట్రీ ఇచ్చి 'ఒకే ఒక్కడు' సినిమాతో ఆడియన్స్ కి ఎంతో దగ్గరైన ఈమె హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసింది.

publive-image

అక్కడ స్టార్ స్టేటస్ అందుకుంది. కెరీర్లో నంబర్ వన్ గా దూసుకుపోతున్న క్రమంలోనే నేపాల్ కి చెందిన సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. భర్తే శత్రువుగా మారడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది.

Also Read : కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

ఆ తర్వాత ఓ వైపు వరుస సినిమా షూటింగ్స్, విడాకుల బాధతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అది చాలదన్నట్లు 2012 లో ఏకంగా క్యాన్సర్ బారిన పడింది. ఆమెకి క్యాన్సర్ అని తెలిసి ఎవ్వరూ పట్టించుకోలేదట. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

publive-image

క్యాన్సర్ అని తెలిసి ఎవరూ పట్టించుకోలేదు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కోయిరాలా తన క్యాన్సర్ రోజులను గుర్తు చేసుకుంది. ఆ టైం లో తనతో ఉన్న స్నేహితులే సంబంధం లేనట్లు వదిలి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. " జనాలకు ఎవరి బాధను పట్టించుకోవడం ఇష్టం ఉండదు. కష్టాల్లో ఉన్నారని తెలియగానే వదిలేసి వెళ్ళిపోతారు.

publive-image

స్నేహితులే కాదు నా బంధువులు కూడా ఎవరూ అండగా నిలబడలేదు. కనీసం నేను ఎలా ఉన్నాను? ఏంటి అనేది కూడా పట్టించుకోలేదు. నా తల్లిదండ్రులు, వదిన, సోదరుడు.. వీళ్ళు మాత్రమే నాకు అండగా నిలబడ్డారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాలు తెలిశాయి. కేవలం నా కుటుంబం వల్లే క్యాన్సర్ ని జయించి మీ ముందు ఇలా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు