Manish Sisodia: మనీష్ సిసోడియాకు షాక్.. మరోసారి కస్టడీ పొడింపు

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఆయన కస్టడీని మరోసారి పొడిగించింది. మే 30 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది.

Manish Sisodia: మనీష్ సిసోడియాకు షాక్.. మరోసారి కస్టడీ పొడింపు
New Update

Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఆయన కస్టడీని మరోసారి పొడిగించింది. మే 30 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా ఇటీవల తనకు ఈ కేసులో బెయిల్ కావాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.

ALSO READ: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇంట్లో విషాదం

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ తరపున మొదట అరెస్టు అయ్యింది మనీష్ సిసోడియానే. 2023 ఫిబ్రవరి 26వ తేదీన ఈ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 28న ఢిల్లీ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న సిసోడియా, తన ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2023 అనంతరం మార్చి 9వ తేదీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కూడా మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఎన్నిసార్లు ప్రయత్నించినా మనీష్ మాత్రం బెయిల్ దొరకడం లేదు.

కేజ్రీవాల్ కు బెయిల్..

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌(Aravind Kejriwal) కు సుప్రీంకోర్టు(Supreme Court) లో భారీ ఊరట లభించింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించకూడదని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం కోసం మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం కేజ్రీవాల్ కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

#manish-sisodia
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe