ఫేక్‌న్యూస్‌ కారణంగానే మణిపూర్‌లో ఘోరాలు..అడ్డగోలుగా పబ్లిష్ చేసిన లోకల్‌ ఛానెల్స్‌..!

మణిపూర్‌ అల్లర్ల వ్యాప్తికి ఫేక్‌న్యూసే ప్రధాన కారణమని తేలింది. ఢిల్లీలో కనిపించిన ఓ మహిళ డెడ్‌బాడీని మెయితీ మహిళకు చెందిన మృతదేహంగా ప్రచారం చేయడంతో రగిలిపోయిన ఆ వర్గం ప్రజలు..కుకీలపై దాడులకు దిగారు.

New Update
ఫేక్‌న్యూస్‌ కారణంగానే మణిపూర్‌లో ఘోరాలు..అడ్డగోలుగా పబ్లిష్ చేసిన లోకల్‌ ఛానెల్స్‌..!

manipur fake news (ప్రతీకాత్మక చిత్రం)

సోషల్‌మీడియా(social media)లో నిత్యం ఫేక్‌న్యూస్‌(fake news)లే దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా మతాలు, కులాలు, పార్టీల ప్రాపగండాలో మునిగిపోయి ఉన్న కొంతమంది యూజర్లు..వాళ్ల కోసం పని చేసే వింగ్‌లు అసత్యాలను వీర లెవల్‌లో వ్యాప్తి చేస్తుంటాయి. సంబంధిత వింగ్‌లకు ఆ విషయం తెలిసినా.. నెటిజన్లు మాత్రం వాటిని ఎడాపెడా షేర్‌లు చేసి పడేస్తుంటారు. వార్త వాళ్లకి అనుకూలంగా ఉంటే చాలు..అది నిజమో..కాదో..అబద్ధం చెబుతున్నారేమోనన్న కనీస ఆలోచన రాదు. క్రాస్‌ చెక్‌ చేసుకుందామన్న కనీస బుద్ధి పుట్టదు. ఈ ఫేక్‌న్యూస్‌లన్ని దాదాపు విద్వేషాన్ని నింపే విధంగానే ఉంటాయి. వాటి కారణంగా అల్లర్లు చెలరేగుతాయి.. రక్తాలు కారుతాయి... కుటుంబాలకు నాశనం అవుతాయి..ఏకంగా ప్రాణాలే పోతాయి. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మణిపూర్‌ వివస్త్ర స్త్రీల ఊరేగింపు ఘటనకు కారణం ఫేక్‌న్యూసేనని తేలింది.

అసలేం జరిగిందంటే..?
మే3న సోషల్‌మీడియాతో పాటు మణిపూర్‌ లోకల్ ఛానెల్స్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. మణిపూర్‌(manipur) క్యాపిటల్‌ ఇంపాల్‌(imphal) ఓ మహిళ శవం దొరికిందని.. అది ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి ఉన్నట్టు ఓ న్యూస్‌ వైరల్‌ అయ్యింది. అది మెయితీ మహిళకు సంబంధించిన డెడ్‌బాడీగా ప్రచారం చేశారు. కుకీలే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సోషల్‌మీడియాలో పోస్టులు కనిపించాయి. ఆమెను అత్యాచారం చేశారని ట్వీట్లు పెట్టారు. అటు వాట్సాప్‌లోనూ ఈ వార్త ఫుల్‌గా షేర్‌ అయ్యింది. కుకీలను వదలకూడదంటూ క్యాప్షన్లు జోడించి మరి కొంతమంది దీన్ని స్ప్రెడ్‌ చేశారు. ఇది మెయితీ ప్రజలను మరింత రెచ్చగొట్టింది. దీంతో తర్వాతి రోజు(మే4) తీవ్రవాదులు(Extremists) ఊర్లమీద పడటానికి నిర్ణయించుకున్నారు. గ్రూప్‌గా ఏర్పడి తౌబాల్ జిల్లా పేచీ అవాంగ్ లీకై గ్రామంపై పడ్డారు.. అక్కడ కనపించిన కుకీలపై దాడికి దిగారు.. మహిళలను అత్యాచారం చేశారు.. అందులో ముగ్గురు మహిళలను వివస్త్రలుగా మార్చి ఊరేగించారు..వారిలో ఓ 21ఏళ్ల యువతిపై సామూహికంగా అత్యాచారం చేశారు.

-->> ఇదంతా ఇప్పటివరకు మనకు తెలిసిన విషయమే.. అయితే అసలు ఈ ఇంపాల్‌ మృతదేహం వార్త పచ్చి అబద్ధం.. న్యూస్‌లో, సోషల్‌మీడియాలో స్ప్రెడ్‌ అయిన మహిళ డెడ్‌బాడీ ఫొటోలు నిజమేనైనా అది ఇంపాల్‌లో లభించిన మృతదేహం కాదు.. ఢిల్లీలో జరిగిన మర్డర్‌కి సంబంధించిన ఫొటో అది.

ఇది ఒక్కటే కాదు:
నిజానికి ఎక్కడ అల్లర్లు జరిగినా..ప్రజల్లో విద్వేషాలు రిగిలినా దాని వెనుక కచ్చితంగా ఫేక్‌న్యూస్‌ ఉండి తీరుతుంది. వాట్సాప్‌లో షేర్ అయ్యే వీడియోలు.. ట్విట్టర్‌లో పెట్టే అసత్యాలతోనే ఎక్కువగా ఇలా జరుగుతుంది. ఎక్కడో మియన్మార్‌లో జరిగిన వీడియోను షేర్ చేస్తూ మణిపూర్‌లో ఓ వర్గానికి చెందిన మహిళను చంపేశారని ప్రచారం చేశారు. మణిపూర్‌లో ప్రత్యేక పాలన కావాలని నిరసన చేస్తున్న మరో వీడియోను షేర్‌ చేస్తూ..ఓ వర్గానికి వ్యతిరేకంగా క్యాప్షన్ జోడించి విద్వేషాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇంఫాల్ లోయలో కొంతమంది గిరిజనులు ఒక మతపరమైన స్థలాన్ని తగలబెట్టారన్న మరో నకిలి వార్త చక్కర్లు కొట్టింది. పోలీసులు సంబంధిత ప్రాంతానికి వెళ్లి చూస్తే.. అక్కడంతా బాగానే ఉండగా.. ఈలోపే ఇరు వర్గాల ప్రజలు పలు గ్రామాల్లో తన్నుకున్నారు. ఇలా ఫేక్‌న్యూస్‌ మణిపూర్‌ హింసకు దారులు తెరిచింది. ఫేక్‌న్యూస్‌ ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చెప్పడానికి మణిపూర్‌ ఎపిసోడ్ ఒక్కటి చాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు