/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/rahul-gandhi-1.jpg)
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మణిపూర్ లో గురువారం హైడ్రామా జరిగింది. రాష్ట్ర రాజధాని ఇంఫాన్ నుంచి రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో వెళ్తుండగా...ఇంఫాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో రాహుల్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకన్నారు. చురాచాంద్ పూర్ జిల్లాలో రాహుల్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతం అల్లర్లతో అట్టుడుకుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/rahul-gandhi-1.jpg)
ఈ నేపథ్యంలో అక్కడ రాహుల్ పర్యటిస్తే..సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయని..గ్రనేడ్ దాడి జరిగే ఛాన్స్ ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మార్గంలో కాకుండా హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. దీంతో రాహుల్ తన పర్యటనను వాయిదా వేసుకుని ఇంఫాల్ కు వెళ్లారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో చురాచాంద్ పూర్ చేరుకున్నారు.
రాహుల్ ప్రయాణించాలనుకున్న మార్గంలో భారీ సంఖ్యలో మహిళలు ఆందోళన నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు చర్యగా కాన్వాయ్ ను నిలిపివేసి బిష్ణుపూర్ లో నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ...మహిళలు పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారని తెలిపారు. రాహుల్ గాంధీ తమ గ్రామంలో పర్యటించాలని మహిళలు ఆందోళనచేపట్టినట్లు తెలిపారు. కాగా మణిపూర్ అన్నాచెళ్లెళ్లను కలవకుండా బీజేపీ అడ్డుకుంటుందని రాహుల్ గాంధీ ఆఱోపించారు.
మణిపూర్ లో మళ్లీ కాల్పుల కలకలం..
మణిపూర్ లో గురువారం మళ్లీ కాల్పులు చెలరేగాయి. సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. కంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన కాల్పుల్లో గాయపడిన ముగ్గురు అనుమానిత అల్లర్లు మరణించారు. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు కూడా గాయపడ్డారు. హరోథెల్ గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడటంతో కాల్పులు జరిపారని సైన్యం తెలిపింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ముగ్గురు హతమైనట్లు తెలిపారు.
కాంగ్‌పోక్పిలో హింసాకాండ తర్వాత ఆర్మీ మరింత భద్రతను కట్టుదిట్టం చేసింది. మరిన్ని బలగాలను రంగంలోకి దింపింది. సైన్యాన్ని రెచ్చగొడుతూ అల్లరిమూకలు కాల్పులు జరుపుతున్నాయని, దానికి ప్రతీకారం తీర్చుకున్నామని సైన్యం చెబుతోంది. కాగా మణిపూర్‌లో గత నెల రోజులుగా హింస ఆగడం లేదు. అల్లరిమూకలకు సైన్యానికి జరిగిన ఎదురుదాడిలో ఇప్పటివరకు 100 మంది చనిపోయారు.
Follow Us