మణిపూర్‌ శవాగారాల్లో పడివున్న మృతదేహాలు చొరబాటుదారులవి..కేంద్రం చెప్పిన సమాధానంపై సుప్రీంకోర్టు రియాక్షన్‌ ఏంటంటే..?

మణిపూర్‌ అల్లర్లలో వందలాది మంది చనిపోగా.. వాటిలో 118మంది మృతదేహాలు ఇంకా శవాగారాల్లోనే పడి ఉండడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం, మణిపూర్‌ తరుఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు ఈ విషయంపై చెప్పిన సమాధానంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మృతదేహాలు చొరబాటుదారులవని మెహతా సుప్రీంకోర్టుకు చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. చొరబాటుదారులు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తుంది కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

New Update
మణిపూర్‌ శవాగారాల్లో పడివున్న మృతదేహాలు చొరబాటుదారులవి..కేంద్రం చెప్పిన సమాధానంపై సుప్రీంకోర్టు రియాక్షన్‌ ఏంటంటే..?

ఆ డెడ్‌ బాడీలు ఎవరిని? వాటిని తీసుకోవడానికి ఎవరూ రారేంటి..? మణిపూర్‌(manipur) శవాగారాల్లో పడి ఉన్న మృతదేహాలపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. మణిపూర్‌లో ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు(supreme court) విచారిస్తుండగా.. ఈ డెడ్‌బాడీల అంశంపై కేంద్రం చెప్పిన సమాధానం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. శవాగారాల్లో పడి ఉన్న మృతదేహాలు చొరబాటుదారులవని సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. కేంద్రం, మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Tushar mehta) సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు. ఆ మృతదేహాలన్ని చొరబాటుదారులవేనని.. దాని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు తుషార్‌ మెహతా.

ఈ వాదన కరెక్టెనా?
కుకీ, మెయితీ వర్గాల అల్లర్ల తర్వాత మణిపూర్‌లో జరిగిన హింసలో అనేక మంది ప్రాణాలు విడవగా.. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక 118 మంది మృతదేహాలు ఇంఫాల్‌లోని శవాగారంలో నెలల తరపడి అలానే ఉన్నాయి. అవి కుళ్లిపోతున్నా వాటి గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. అయితే ఈ డెడ్‌బాడీలన్ని చొరబాటుదారులవని చెప్పి కేంద్రం చేతులు దులుపుకొనే ప్రయ్నతం చేస్తుందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అంతమంది చొరబాటుదారులు దేశంలోకి ఎలా వచ్చారో చెప్పాలని ప్రశ్నిస్తున్నాయి. చొరబాటుదారులు దేశంలోకి వస్తుంటే కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని నిలదీస్తున్నారు. బాధిత కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడంలో కేంద్రం విఫలమైందని.. ఆ తప్పును చొరబాటుదారుల పేరుతో కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని వాదిస్తున్నాయి. చనిపోయిన చొరబాటుదారులే 118మంది ఉంటే అసలు బతికున్న వాళ్లు ఎంత మంది ఉంటారో అంటూ మండి పడుతున్నాయి.

నష్టపరిహారం మాటేంటి?
అటు సుప్రీంకోర్టు కూడా తుషార్ మెహతా సమాధానంతో సంతృప్తి చెందినట్టు అనిపించలేదు. మృతదేహాలను గుర్తించడంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను వివరించాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ మృతదేహాలను శవాగారంలో ఎల్లప్పడు ఉంచలేమంటూ సీజేఐ చండ్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మృతదేహాలను సంబంధిత బంధువులకు అప్పగించేలా నోడల్ అధికారిని నియమించారా అని కోర్టు మణిపూర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాధితులకు నష్టపరిహారం అంశంలో కూడా పరిష్కరించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. హత్యకు గురైన వ్యక్తికి రూ.10 లక్షలు ఇస్తామని నెల రోజుల క్రితమే హోంమంత్రి ప్రకటించినా ఇప్పటివరకు ఎందుకు అమలు కాలేదో చెప్పాలని బాధితల తరుఫున వాదిస్తున్న లాయర్‌ కోలిన్ గోన్సాల్వేస్ ప్రశ్నించారు. అటు మణిపూర్‌లో అశాంతికి మియన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులే ప్రధాన కారణమని సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ కూడా చెప్పాడాన్ని సీజేఐ తప్పుబట్టారు. చనిపోయింది మన దేశపు మహిళలే కదా అంటూ రివర్స్‌ క్వశ్చన్‌ వేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు