హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?

మణిపూర్.. నిత్యం ఘర్షణలు, హింసాత్మక సంఘటనలతో రగిలిపోతుంది. నానాటికి శాంతిభద్రతలు మరింతగా దిగజారిపోతున్నాయి. ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ ఇవాళ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయం, రాజ్‌భవన్‌ వెలుపల ఆందోళన తీవ్రమైంది. గవర్నర్‌తో సీఎం అపాయింట్‌మెంట్ కోరారు. కాగా, సీఎం రాజీనామా చేయకూడదంటూ సచివాలయం దగ్గర కూడా నిరసనకు దిగారు.

New Update
హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?

గత నెల నుంచి మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ఆగడం లేదు. ఈరోజు కూడా చెదురుమదురు సంఘటనలు సంభవించాయి. ఘర్షణలు రోజురోజుకూ తీవ్రమవతున్న నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేసే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ నేడు ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీరెన్ సింగ్ గవర్నర్ తో భేటీ కానున్నారు. మణిపూర్ లో జాతీ ఘర్షణల మధ్య శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో బీరెన్ సింగ్ తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు గవర్నర్ కు తన రాజీనామా లేఖను అందజేయనున్నట్లు మణిపూర్ వర్గాలు వెల్లడించాయి.

biren singh

సీఎం బీరెన్ రాజీనామాపై రాష్ట్ర పుకార్లు తీవ్రం కావడంతో, కార్యకర్తలు సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. వందలాది మంది మహిళలు సుమారు 100 మీటర్ల దూరంలోని నుపి లాల్ కాంప్లెక్స్ వద్ద గుమిగూడి, ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేయవద్దంటూ నినాదాలు చేశారు. మహిళా నాయకురాలు క్షేత్రమయం శాంతి మాట్లాడుతూ ఈ క్లిష్ట తరుణంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం దృఢంగా ఉండి అక్రమార్కులను అణిచివేయాలని అన్నారు.

కాగా గురువారం కాంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా బలగాలు, అల్లరిమూకలకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య శుక్రవారం మూడుకు పెరిగిందని అధికారులు తెలిపారు. ఈరోజు మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. గురువారం హరోథెల్ గ్రామంలో కాల్పులు జరిగాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, అల్లరిమూకలను తరిమికొట్టారని సైన్యం తెలిపింది. కాంగ్‌పోక్పిలో, మహిళల నేతృత్వంలోని నిరసనకారులు, తమను అరెస్టు చేయాలని పోలీసులకు సవాలు విసిరారు. పోలీసులను అడ్డుకోవడానికి రహదారి మధ్యలో టైర్లను తగలబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు