పాయల్ గట్స్ కి హాట్సాఫ్..డైరెక్టర్ ప్రశంసలు.!

విజయవాడలో మంగళవారం మూవీ టీం సందడి చేసింది. మంగళవారం చిత్రంను ఎంతో ఛాలెంజ్ గా చేసినట్లు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలిపింది. ఈ క్రమంలోనే శైలజ పాత్రలో నటించినందుకు పాయల్ గట్స్ కి హాట్సాఫ్ అని కొనియాడారు డైరెక్టర్ అజయ్ భూపతి.

పాయల్ గట్స్ కి హాట్సాఫ్..డైరెక్టర్ ప్రశంసలు.!
New Update

Payal Rajput: విజయవాడలో మంగళవారం మూవీ టీం సందడి చేసింది. సినిమా సక్సెస్ కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు.  కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ..మంగళవారం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ మూవీలో ఎంతో ఛాలెంజ్ గా నటించినట్లు వెల్లడించింది.

publive-image

డైరెక్టర్ ఈ కథ గురించి చెప్పినప్పుడు శైలజ పాత్రలో నటించడానికి ఆలోచించానని..ఈ పాత్ర చేయడానికి చాలా గట్స్ కావాలని అంది. అయితే, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చేయడానికి మొదట నా తల్లి అనుమతించడంతో చాలా సంతోషపడ్డానని చెప్పుకొచ్చింది.

publive-image

గ్రామీణ వాతావరణం లో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని వెల్లడించింది. మహిళా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని..ఈ చిత్రాన్ని బోల్డ్ మూవీ అనుకుంటున్నారు. ఈ సినిమా చూస్తేనే సినిమా యొక్క విలువ తెలుస్తుందని చెప్పింది. ఈ చిత్రంలో అసభ్యకర సన్నివేశాలు ఏమీ లేవు.. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని వ్యాఖ్యనించింది. మంగళవారం 2 కూడా త్వరలో సెట్స్ పైకి రానుందని తెలిపింది.

publive-image

Also Read: పవన్ కళ్యాణ్ అహంకారి..జనసేన సందీప్ సంచలన వ్యాఖ్యలు.!

డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ..ఆర్ఎక్స్ 100 తర్వాత అంతటి ఘనవిజయం ఈ చిత్రానికి లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ప్రతి సన్నివేశం ఒక ట్విస్ట్ గానే ఉంటుందని..చిత్రం చివరి 40 నిమిషాలు ఉత్కంఠం కలిగిస్తుందని కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగులు పొడిపించే సన్నివేశాలు ఉన్నాయని అన్నారు.

publive-image

పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రాన్నికి పిల్లర్ల నిలిచారని.. ఈ చిత్రాల్లో నటించినందుకు ఆవిడ గట్స్ కి హాట్సాఫ్ అని కొనియాడారు.ఈ చిత్రంలో నటించిన నటులందరూ ఈ చిత్రానికి ప్రాణం పోశారని..లక్ష్మణ్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్రను చేపట్టామని వ్యాఖ్యనించారు. ప్రతి థియేటర్లో ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనను మరువలేమన్నారు. మంగళవారం 2 చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.

#mangalavaram-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి