/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YS-Sharmila-Jagan-jpg.webp)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP), పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో (YS Sharmila) పాటు తాను కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనని ప్రకటించారు. షర్మిలతో పాటు సీఎం జగన్ ను కలవడానికి కూడా వెళ్తున్నానన్నారు. అయితే.. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బలవంతపు భూసేకరణను మాత్రమే తాను వ్యతిరేకించానన్నారు.