Kannappa : 'పుష్ప 2' కు పోటీగా 'కన్నప్ప'.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే?

హీరో మంచు విష్ణు తాజాగా తన సోషల్ మీడియాలో 'కన్నప్ప' రిలీజ్ పై అప్డేట్ ఇచ్చాడు. ట్విట్టర్ లో 'డిసెంబరు 2024' అని ఆయన ట్వీట్‌ చేశారు. 'కన్నప్ప' హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు. దీంతో కన్నప్ప డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు స్పష్టమవుతుంది.

Kannappa : 'పుష్ప 2' కు పోటీగా 'కన్నప్ప'.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే?
New Update

Manchu Vishnu Update On Kannappa Release : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' భారీ తారాగణంతో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవలే టీజర్ కూడా వదిలారు. ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.

హీరో మంచు విష్ణు తాజాగా తన సోషల్ మీడియాలో కన్నప్ప రిలీజ్ పై అప్డేట్ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో 'డిసెంబరు 2024' అని ఆయన ట్వీట్‌ చేశారు. 'కన్నప్ప' హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు. దీంతో కన్నప్ప డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు ఇదే డిసెంబర్ లో 'పుష్ప 2' రిలీజ్ కానుంది. ఇప్పుడు కన్నప్ప సైతం అదే నెలలో రాబోతుంది.

మరి 'పుష్ప 2' తో 'కన్నప్ప' పోటీ పడుతుందా? లేక సింగిల్ డేట్ చూసుకొని బరిలోకి దిగనుందా? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో విష్ణు తో పాటూ ప్రభాస్, అక్షయ్‌ కుమార్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

#manchu-vishnu-kannappa #kannappa-release-date
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe