Vishnu: డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు మంచు విష్ణు వార్నింగ్.. అలా చేస్తే ఊరుకోమంటూ!

ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే నటీ నటులు, మహిళలపై అప్ లోడ్ చేసిన అసభ్యకరమైన వీడియోలు 48గంటల్లో డిలిట్ చేయాలని కోరారు. లేదంటే చట్టరిత్యా చర్యలుంటాయని హెచ్చరించారు.

New Update
Vishnu: డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు మంచు విష్ణు వార్నింగ్.. అలా చేస్తే ఊరుకోమంటూ!

Vishnu Manchu: ఫేక్ అండ్ ట్రోలింగ్ కు పాల్పడుతున్న డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు సీరియ్ వార్నింగ్ ఇచ్చారు. నటీనటులపై కాంట్రవర్సీగా చేసిన వీడియో, కామెంట్స్ 48గంటల్లో డిలిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్‌ వీడియోలను డిలీట్‌ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల తండ్రి-కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్‌ చేసిన యూట్యూబర్లపై విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్త్రీలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదని, ఎంతటి వారినైన వదిలిపెట్టకుండా చట్ట రిత్యా శిక్షలు పడేలా చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు