Manchu Vishnu Movie: కన్నప్ప దిగుతున్నాడు.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "భక్త కన్నప్ప". 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి చిత్రీకరిస్తున్న ఈ సినిమా పై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఇక తాజాగా మంచు విష్ణు ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 23 న ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందని ట్వీట్ చేశారు.

New Update
Manchu Vishnu Movie:  కన్నప్ప దిగుతున్నాడు.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!

Manchu Vishnu Movie: హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "భక్త కన్నప్ప". చాలా సంవత్సరాల నుంచి మంచు విష్ణు చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా. మంచు విష్ణు తండ్రి సీనియర్ నటుడు మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతే కాదు మోహన్ బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం న్యూ జిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో మంచు విష్ణు కు గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. అయినా సరే షూటింగ్ మాత్రం బ్రేక్ లేకుండా బిజీగా సాగుతోంది. 100 కోట్లకు పైగా  ఖర్చు పెట్టి చిత్రీకరిస్తున్న ఈ సినిమా పై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. భక్త కన్నప్ప చిత్ర బృందం న్యూ జిలాండ్ లోనే భారీ సెటప్ వేసి సినిమా షూటింగ్ బిజీగా చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కు సంబంధించి  ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నటులు ప్రభాస్, నయనతార నటించనున్నారు. ప్రభాస్ శివుడి పాత్రలో, నయనతార పార్వతి దేవి పాత్రలో, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

publive-image

పాన్ ఇండియా రేంజ్ లో.. మల్టీ స్టారర్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచు విష్షు కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా అనే చెప్పొచ్చు. పౌరనికా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మంచు విష్ణు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 23 న 'భక్త కన్నప్ప' చిత్రం నుంచి సూపర్ అప్డేట్ రాబోతుందని ట్వీట్ చేశారు. ఇక ఈ అప్డేట్ లో సినిమా లోగో రివీల్ చేస్తారా.. లేదా ప్రభాస్ శివుడి పాత్ర రివీల్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Suma Kanakala’s: యాంకర్ సుమకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట..!

Advertisment
తాజా కథనాలు