అయ్యో ..మంచు విష్ణుకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్‌..!!

‘కన్నప్ప’ షూటింగ్‌లో టాలీవుడ్ హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. న్యూజిలాండ్‌లో యాక్షన్ సీన్స్‌ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణుపై పడింది. దీంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. వెంటనే షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారు. వెంటనే మంచు విష్ణుకి చికిత్స స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

అయ్యో ..మంచు విష్ణుకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్‌..!!
New Update

Manchu Vishnu Injured: మంచు విష్ణు ఈసారి కన్నప్ప సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఎవరు కూడా ట్రై చేయని కన్నప్ప కథను అతను తీసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా నటిస్తూ ఉండడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

publive-image

మంచు విష్ణు ఎంతో ఇష్టంగా చేస్తున్న కన్నప్ప చిత్రంపై హైప్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, ఆర్టిస్టులు కన్నప్పలో ఉన్నారని తెలుస్తోంది. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు.

publive-image

అయితే జోరుగా షూటింగ్ జరుపుతున్న కన్నప్ప టీంకి అనుకోని ఘటన ఎదురైంది. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణుపై డ్రోన్ పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయని సమాచారం. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు గాయపడ్డారని తెలియడంతో  ఆయన  కుటుంబసభ్యులే కాకుండా  అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. అయితే, భయపడాల్సినంత పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని సమాచారం.

publive-image

విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2003లో విష్ణు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అతడు అతి తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగాడు. అందం, అభియనంతో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా సూర్యం, పొలిటికల్ రౌడీ, అస్త్రం, గేమ్, ఢీ, కృష్ణార్జున, సలీం, వస్తాడు నా రాజు, దేనికైనా రేడీ, దూసుకెళ్తా, పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు, డైనమైట్, ఈడోరకం ఆడోరకం వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.

publive-image

Also Read: ఆ విషయంలో శోభదే తప్పు.. ఇదిగో వీడియో ప్రూఫ్!

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe