Manchu Vishnu : గోల్డెన్ వీసా అందుకున్న మంచు విష్ణు..!

టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు యూఏఈ గోల్డెన్‌ వీసా లభించింది. కళలు, సాంస్కృతిక రంగాలకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. గత శుక్రవారం అబుదాబిలోని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ యూఏఈ గోల్డెన్‌ వీసాను మంచు విష్ణుకు అందించింది.

New Update
Manchu Vishnu : గోల్డెన్ వీసా అందుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu Gets Golden Visa : టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు యూఏఈ గోల్డెన్‌ వీసా లభించింది. కళలు, సాంస్కృతిక రంగాలకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. గత శుక్రవారం అబుదాబిలోని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ యూఏఈ గోల్డెన్‌ వీసాను మంచు విష్ణుకు అందించింది.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ..' యూఏఈ ప్రభుత్వం నుంచి ఈ గోల్డెన్‌ వీసా అందుకోవడం చాలా సంతోషంగా ఉందని' తెలిపారు. కాగా ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భార్య ఉపాసన గోల్డెన్ వీసా అందుకున్నారు. తాజాగా ఈలిస్ట్ లో మంచు విష్ణు కూడా చేరడం విశేషం.

Also Read : ఫారిన్ లో ‘కల్కి’ సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్న జగపతి బాబు.. వైరల్ అవుతున్న వీడియో!

గోల్డెన్ వీసా ఎవరిస్తారు?

ఇన్వెస్టర్స్, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, నటులు, సాహిత్యం, క‌ల్చర్‌, ఇలా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులకు 10 ఏళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది యూఏఈ ప్రభుత్వం. 2009 నుంచి గోల్డెన్ వీసాలను మంజూరు చేయడం స్టార్ట్ చేశారు. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా UAEలో ఎక్కువ కాలం పాటు నివసించే వీలు ఉంటుంది. UAE పౌరులుగా అక్కడి ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు