Lakshmi Manchu: స్వలింగ సంపర్కుల వివాహాలకు (same-sex marriage) చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఇదే అంశంపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో స్పందించారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందని పోస్ట్ చేసింది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) చెప్పడం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని తెలిపింది. మిగిలిన ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన మన దేశానికి ఈ తీర్పు నిజంగా అవమానమని పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇతర దేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారని..మరి మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా? అని ప్రశ్నించింది మంచు లక్ష్మి.
Also Read: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఘనత..ఫుల్ జోష్ లో ఫ్యాన్స్..!!
స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సేమ్ జెండర్ వివాహాలు చట్టబద్దం కాదని తేల్చి చెప్పింది. వివాహ హక్కుల నిర్ధారణకు ప్రభుత్వం కమిటీ వేయాలని ఆదేశించింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది పార్లమెంటు మాత్రమేనని చెప్పింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్వలింగ వివాహాల చట్టబద్ధత’పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.