Jainuru: భగ్గుమన్న జైనూరు...144 సెక్షన్‌ విధింపు!

ఆటోలో ఎక్కిన మహిళ పై డ్రైవర్‌ అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో ఆసిఫాబాద్‌ జిల్లాలోని జైనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీయడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 1000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు

Jainuru: భగ్గుమన్న జైనూరు...144 సెక్షన్‌ విధింపు!
New Update

Jainuru: ఆటోలో ఎక్కిన మహిళ పై డ్రైవర్‌ అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో ఆసిఫాబాద్‌ జిల్లాలోని జైనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దారుణ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న మహిళను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్.. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో అరుపులు, కేకలు వేసిన మహిళ.. ఆటో నుంచి కిందకి దూకేసింది. అనంతరం ఆమెపై ఇనుప రాడ్‌తో దాడి కి దిగాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ స్పృహ తప్పింది. ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్ అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై దాడి చేసిన వ్యక్తి గురించి చెప్పడంతో ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి అతడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియడంతో మహిళ తరుఫున వారు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.

నిందితుడి వర్గానికి చెందిన ఇళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలను తగులబెట్టడం, కూల్చేయడం చేశారు. ఈ క్రమంలోనే జైనూర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఇరువర్గాల దాడుల నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన పై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయింది. జైనూర్‌లో బుధవారం 144 సెక్షన్ విధించింది. 1000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ జితేందర్ మీడియాకి తెలిపారు.

అంతేకాకుండా ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టొద్దని యువతకు డీజీపీ సూచించారు. ప్రస్తుతం జైనూర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. వెంటనే డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Also Read: నిన్న జగన్.. ఇవాళ లచ్చన్న… మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ!

#asifabad #144-section
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి