Lion Bite : సింహం నోట్లో చేయిపెట్టిన యువకుడు.. మూడు పళ్లతో అదిమిపట్టిన మృగం!

కేరళలోని ఓ వ్యక్తి సింహంతో సాహసోపేతమైన చర్యకు పాల్పడ్డాడు. అలీఖాన్ అనే ఇన్ స్టా యూజర్ కౄరమృగం తనతో దోస్తీ చేస్తున్నట్లు తెలుపుతూ దాని నోట్లో చేయి పెట్టిన వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ఇది క్షణాల్లో వైరల్ అవగా జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు.

New Update
Lion Bite : సింహం నోట్లో చేయిపెట్టిన యువకుడు.. మూడు పళ్లతో అదిమిపట్టిన మృగం!

Viral video: సోషల్ మీడియా మనుషుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోంది. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవాలనే తపనతో యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్ (ఎక్స్), ఫేస్ బుక్ తదితర ప్లాట్ ఫామ్ ల వేదికగా జనాలు సాధ్యంకాని సాహసాలకు సైతం పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని భయంకరమైన స్టంట్స్, సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు వన్య మృగాలతోనూ సాహసోపైతమైన చర్యలకు పాల్పడుతూ చావు దెబ్బ తింటున్నారు. ఇటీవలే తిరుపతిలో ఓ యువకుడు గంజాయి మత్తులో సింహానికి సవాల్ విసిరి దానికి ఆహారంగా మారిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరొక వ్యక్తి సింహంతో సరసాలాడుతూ సరదాగా దాని నోట్లో చేయిపెట్టి వీడియోను నెట్టంట షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

View this post on Instagram

A post shared by ALi Khan AK (@alikhanakreal)

నోటిలోకి చేతిని చొప్పించి..
ఈ మేరకు @alikhanakreal అనే సోషల్ మీడియా యూజర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా సాహసోపేతమైన వీడియో పోస్ట్ చేసి ఇంటర్నెట్‌ను యూజర్స్ కు షాక్ ఇచ్చాడు. పడుకుని సేదతీరుతున్న సింహన్ని నెమురుతూ దానితో చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. అదికూడా అతని స్పర్శను ఆశ్వాదించడంతో మరింత రెచ్చిపోయిన వ్యక్తి.. సింహం నోటిలోకి చేతిని చొప్పించగా అది పళ్లతో గట్టిగా అదిమి పట్టింది. ఈ తంతంగం మొత్తం వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా అది క్షణాల్లో 2 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుని వైరల్ గా మారింది. అయితే ఇందులో అతనికి ఏ ప్రమాదం జరగకపోయినా దీనిపై పలువురు విభిన్న కామెంట్స్ చేస్తున్నారు. అతను ధైర్య వంతుడంటూ కొంతమంది పొగుడుతుంటే మరికొందరు అడవి జంతువులతో కౄరంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Bill Gates: ‘వన్‌ ఛాయ్ ప్లీస్‌’.. డాలీ చాయ్‌వాలా టీ ఆస్వాదించిన బిల్‌గేట్స్‌

ఈ సాహసోపేతమైన చర్య అని సంబరపడిపోతున్నప్పటికీ నిజంగా ఇదొక 'వెర్రి' అంటూ అతన్ని జంతు ప్రేమికులు తిట్టిపోస్తున్నారు. 'ఓహ్ మై గుడ్‌నెస్.. అతను ఏమి చేస్తున్నాడు? నిజంగా ఇది తెలివి లేని చర్య' అంటూ మండిపడుతున్నారు. వెంటనే అతనిపై అటవిశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు