హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ చిన్నారి మోక్షజ్ఞ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాప జాతకం బాగోలేదని కూతుర్ని చంపాడు తండ్రి చంద్రశేఖర్. మనస్పర్థాలతో చంద్రశేఖర్, హిమాబిందు విడిగా ఉంటున్నారు. రోజూ స్కూల్‌లో కూతుర్ని దిగబెట్టి ఉద్యోగానికి హిమాబిందు వెళ్తుంది. ఇక పాపను స్కూల్ నుంచి అత్తింటికి తీసుకెళ్లేవాడు చంద్రశేఖర్. కూతుర్ని కంటికి రెప్పలా చూసుకున్నే వాడని పోలీసులు చెబుతున్నారు. విచక్షణ కోల్పోయి, పాపను హతమార్చినట్టు చెప్పారు. హత్యకు ముందు కూతురి జాతకాన్ని చూపించాడు నిందితుడు. భవిష్యత్తులో కూతురికి కష్టాలు ఉంటాయని జ్యోతిష్యుడు చెప్పడంతో మోక్షజ్ఞ కష్టాలు పెడతారని భావించిన తండ్రి చంపేశాడు.
వీళ్లేం మనుషులు?
పరిచయం లేకున్నా.. రోజు చూసే ఓ మనిషి ప్రాణాలు కోల్పోతే అయ్యో పాపం అని జాలి పడతారు మనుషులు. మరణించిన వారితో అంత అనుబంధం లేకున్నా బాధిత కుటుంబాన్ని ఓదార్చుతారు. అయితే మోక్షజ్ఙ ఉంటున్న ఏరియాలో మనుషులు మరి చిత్రవిచిత్రంగా ఉన్నారు. అసలు వీళ్లేం మనుషులు రా బాబు అనుకునేలా వారి ప్రవర్తన ఉంది. పక్కింట్లో ప్రాణాలు పోయినా స్థానికులు పట్టించుకోవడంలేదు. చిన్నారి కుటుంబాన్ని కనీసం పరామర్శించిన పాపాన పోలేదు.
మృతురాలు మోక్షజ్ఞ, బీహెచ్‌ఈఎల్‌లోని జ్యోతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా, ఆమె తల్లితో కలిసి జీవిస్తోంది. అయితే కొంతకాలంగా భార్యతో విడివిడిగా ఉంటున్న ఆమె తండ్రి చంద్రశేఖర్ తరచుగా కూతురిని కలుస్తున్నాడు. ఆగస్టు 19న కూతురి పాఠశాలకు వెళ్లి కారులో తనతో పాటు వెళ్లాలని ఆమెను నమ్మించి గొంతుకోసి హత్య చేశాడు. పాప మెడలో పెన్సిల్ గుచ్చి చంపేశాడు. తర్వాత ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్ వద్దకు కారును తీసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టాడు. అనుమానాస్పదంగా వెళ్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కూతురును హత్య చేసినట్లు అర్థమైంది.
పాప జాతకం బాగోలేదని కూతుర్ని చంపిన తండ్రి..మోక్షజ్ఞ హత్య కేసులో సంచలన విషయాలు!
హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ చిన్నారి మోక్షజ్ఞ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. కూతురి జాతకం బాగోలేదనే కారణంతోనే విచక్షణ కోల్పోయిన తండ్రి చంద్రశేఖర్ చిన్నపాపను చంపేశాడు. భవిష్యత్తులో కూతురికి కష్టాలు ఉంటాయని జ్యోతిష్యుడు చెప్పడంతో మోక్షజ్ఞ కష్టాలు పెడతారని భావించిన తండ్రి హత్య చేశాడు.
New Update
Advertisment