పాప జాతకం బాగోలేదని కూతుర్ని చంపిన తండ్రి..మోక్షజ్ఞ హత్య కేసులో సంచలన విషయాలు!
హైదరాబాద్ బీహెచ్ఈఎల్ చిన్నారి మోక్షజ్ఞ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. కూతురి జాతకం బాగోలేదనే కారణంతోనే విచక్షణ కోల్పోయిన తండ్రి చంద్రశేఖర్ చిన్నపాపను చంపేశాడు. భవిష్యత్తులో కూతురికి కష్టాలు ఉంటాయని జ్యోతిష్యుడు చెప్పడంతో మోక్షజ్ఞ కష్టాలు పెడతారని భావించిన తండ్రి హత్య చేశాడు.