Man Dressed As His Girlfriend To Write Exam :స్నేహితురాలి వేషంలో పరీక్ష రాయాలని అమ్మాయిలా నటించి...

తన స్నేహితురాలి స్థానంలో పరీక్ష రాయడానికి అమ్మాయిలా నకిలీ ఓటరు, ఆధార్ కార్డులు సృష్టించి అమ్మాయి వేషంలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన యువకుడు అధికారుల తనికీలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు.

New Update
Man Dressed As His Girlfriend To Write Exam :స్నేహితురాలి వేషంలో పరీక్ష రాయాలని అమ్మాయిలా నటించి...

పంజాబ్ ఫరీద్‌కోట్ లోని ఓ పరీక్షాకేంద్రంలో ఇటీవల జరిగిన ఒక విచిత్ర సంఘటన నవ్వులు పూయించింది. విషయం తెలిసిన తర్వాత పరీక్ష రాస్తున్నవారితో పాటు, ఇన్విజిలేటర్లు, అధికారులు నవ్వాపుకోలేక కడుపులు పట్టుకున్నారు.

జనవరి 7న, కొట్కాపురాలోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధ్వర్యంలో మల్టీపర్పస్‌ హెల్త్ వర్కర్స్‌ పరీక్ష నిర్వహించారు. ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్‌ అనే యువకుడు తన స్నేహితురాలైన పరంజీత్ కౌర్ స్థానంలో ఆమెలా వేషం ధరించి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా లేడీస్‌ సూట్, ఎరుపురంగు బ్యాంగిల్స్‌, బిందీ, లిప్‌స్టిక్ ధరించి అచ్చం అమ్మాయిలా వచ్చే సరికి ఎవరూ గుర్తించలేకపోయారు. వేషానికి తగినట్టు అమ్మాయి వేషంలో పరంజీత్ కౌర్ పేరుతో నకిలీ ఓటరు కార్డు, ఆధార్ కార్డులను తయారు చేయించాడు. పరీక్షా కేంద్రంలో తనికీల సమయంలో అన్ని సరిపోలడంతో ఎవరికీ అనుమానం రాలేదు. పరీక్ష ప్రారంభమైంది. అప్పటివరకు అన్ని అనుకున్నట్టే జరగడంతో అంగ్రేజ్ సింగ్ కూడా సంతోషంతో పరీక్ష రాయటంలో నిమగ్నమయ్యాడు.

అదే సమయంలో ఇన్విజిలేటర్ ఒక్కొక్కరి దగ్గర బయోమెట్రిక్ తీసుకున్నాడు. ఇక అంగ్రేజ్ సింగ్ వంతు రానే వచ్చింది. అయితే బయోమెట్రిక్ పరికరంలో అతని వేలిముద్రలు మాత్రం నిజమైన అభ్యర్థి వెలిముద్రలతో సరిపోలేదు. అంగ్రేజ్ వేషం అచ్చం అమ్మాయిలా ఉండటం తో ఇన్విజిలేటర్ కు ఎలాంటి అనుమానం రాలేదు. బయోమెట్రిక్ లో సాంకేతిక సమస్య ఉండవచ్చన్న అనుమానంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. అధికారులు వచ్చాక కూడా వేలుముద్రలు వేయించి చూసినా సరిపోలేదు. దీంతో యూనివర్సిటీ అధికారులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో విషయం వెలుగు చూసింది. అప్పటివరకు అమ్మాయి అనుకున్న అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇదంతా చూసిన ఇన్విజిలేటర్లు, అధికారులు నవ్వాపుకోలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే దురదృష్టవశాత్తు నిజమైన అభ్యర్థి పరంజిత్ కౌర్ దరఖాస్తును యూనివర్సిటీ అధికారులు తిరస్కరించారు. మరోవైపు అంగ్రేజ్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Advertisment
తాజా కథనాలు