Chicken : ప్రాణం తీసిన చికెన్‌ ముక్క.. గొంతులో ఇరుక్కుని యువకుడి మృతి!

రంగారెడ్డి జిల్లా ఎలికట్ట గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్న జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన జితేందర్‌ అనే యువకుడు నిన్న రాత్రి చికెన్‌ ముక్క గొంతులో ఇరుక్కొని చనిపోయాడు. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Chicken : ప్రాణం తీసిన చికెన్‌ ముక్క.. గొంతులో ఇరుక్కుని యువకుడి మృతి!
New Update

Chicken Piece : ప్రస్తుత రోజుల్లో ప్రాణం పోకడ.. వాన రాకడ ఎప్పుడో ఎవరికి తెలియడం లేదు. అప్పటి వరకు ఆనందంగా అందరితో కలిసి మెలిసి చిందులేసిన వ్యక్తే ఒక్కసారిగా ప్రాణాలు వదిలేస్తే చుట్టు ఉన్న వారికి ఏం చేయాలో కూడా తెలియదు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

గొంతులో చికెన్‌ ముక్క..

గొంతులో చికెన్‌ ముక్క(Chicken Piece) ఇరుక్కొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఫరూఖ్ నగర్‌ మండలం ఎలికట్ట గ్రామంలో ఓ వ్యక్తి గొంతులో చికెన్‌ ముక్కు ఇరుక్కొని చనిపోయాడు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్‌ వర్మ , ధర్మేందర్‌ తివారీ అనే యువకులు చాలా కాలం క్రితం ఎలికట్ట గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

నిన్న రాత్రి దావత్(Daawath) చేసుకుందామనుకున్నారు. చికెన్‌ తెచ్చుకుని, పూరీ కూడా తినడానికి వండుకున్నారు. అందులోకి మద్యం కూడా తెచ్చుకున్నారు. అందుకు ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. వంటలు పూర్తయిన తరువాత ఇద్దరు కూర్చొని తింటుండగా ఒక్కసారిగా జితేంద్ర కిందకు పడిపోయాడు.

ఏం జరిగిందో ధర్మేందర్‌ కు అర్థం కాలేదు. ముందు ఎక్కువ మద్యం తాగడం వల్లే కింద పడిపోయి ఉంటాడు అనుకున్నాడు. కానీ కొద్ది సేపు అతన్ని గమనించిన తరువాత ధర్మేందర్‌ ఒక్కసారిగా షాక్‌ కి గురయ్యాడు. ఎందుకంటే జితేందర్‌ శ్వాస తీసుకోవడం లేదు. వెంటనే జితేందర్‌ ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యులను ఆరా తీశారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కోవడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ధర్మేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: తెలుగు రాష్ట్రాలతో పాటు సంక్రాంతిని జరుపుకునే ఇతర రాష్ట్రాలు ఏంటో తెలుసా!

#hyderabad #chicken-piece #daawath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe