ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్ చేసిన పనికి అందరు షాక్‌..

ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి చేసిన పని తోటి ప్రయాణికులు అసహ్యించుకునేలా చేశాయి. అంతేకాదు.. అలా చేయకూడదని ఫ్యాసింజర్లు ఎంత మొత్తుకున్నా.. తన పనితో అందరికి కోపం తెప్పించాడు. ఇంతకీ ఏం చేశాడంటే... విమానంలో ప్రయాణిస్తున్న రామ్ సింగ్ అనే వ్యక్తి తన సీటు వరుసలోనే మల, మూత్ర విసర్జన చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్యాసింజర్స్ తనపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్ చేసిన పనికి అందరు షాక్‌..
New Update

Man-Defecates-Mid-Air-On-Mumbai-Delhi-Air-India-Flight-Arrested

ముంబై - ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి చేసిన జుగుప్సాకర చేష్ట తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని అసహ్యించుకునేలా చేసింది. విమానంలో ప్రయాణిస్తున్న రామ్ సింగ్ అనే వ్యక్తి తన సీటు వరుసలోనే మల, మూత్ర విసర్జనలు చేశాడు. ఈ నెల 24 న జరిగిన ఈ సంఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 17 ఎఫ్ సీటులో కూర్చున్న రామ్ సింగ్ ఉమ్మివేశాడని కూడా తెలిసింది. ఇతడిని విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్రంగా హెచ్చరించారని, దూరంగా కూర్చోబెట్టారని వెల్లడైంది.

నిందితుడిపై 294, 510 సెక్షన్ల కింద కేసు నమోదు

ఇతని పరిస్థితిని పైలట్ కి కూడా తెలియజేశారు. విమానం దిగగానే రామ్ సింగ్ ను సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మద్యం తాగిన మత్తులో ఇలా చేశాడా అన్నది తెలియలేదు. 294, 510 సెక్షన్ల కింద ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.గత ఏడాది నవంబరు 26 న కూడా ఓ వ్యక్తి .. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. అతడు కూడా మద్యం తాగిన మత్తులో ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. పది రోజుల తరువాత ..డిసెంబరు 6 న ప్యారిస్ -న్యూఢిల్లీ ఎయిరిండియా విమానంలోనూ ఓ వ్యక్తి ఇలాగే చేశాడు.

ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదన్న సిబ్బంది

గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరగగా... వారిపై ఎయిరిండియా సిబ్బంది పలు చర్యలు తీసుకున్నారు. అయితే.. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కావడంతో తాము ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బందికి అస్సలు అంతుపట్టడం లేదని అంతేకాదు.. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదని అంటున్నారు. వీరిని పోలీసులకు అప్పగించినప్పటికీ విమానాలను అపరిశుభ్రం చేస్తున్న ఉదంతాలపై విమాణంలో ప్రయాణించే ప్యాసింజర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe