Ganesh Chaturthi 2023: వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల వినాయక విగ్రహాల ప్రతిమల ప్రతిష్టించి పూజించటం చూస్తాం.. పోట్టపై పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యాను ఎప్పుడైనా చూసారా.. ఇదిగో కాకినాడ(Kakinada) స్థానిక ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద(Yoga Guru) యోగి యోగాలో చెప్పబడిన నౌలి క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను బిగబట్టి వినాయకుని ఆకృతిలో ఏర్పరిచి విఘ్నేశ్వరునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ ప్రక్రియ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
'వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు..
మనం ఇప్పటివరకు పేపరు లేదా గోడపై బొమ్మలు వేయడం చూసాం.. కానీ ఎవరూ ఇప్పటి వరకు చేయనిరీతిలో పొట్ట కండరాలపై విభిన్న కళాకృతులు యోగా ద్వారా చూపిస్తున్నారు కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి. యోగా శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 'నౌలి' అనే ప్రక్రియ ద్వారా ఆయన చేసే విభిన్న ఆకృతులు అందరిని ఆకరిస్తున్నాయి. ముఖ్యంగా పొట్ట కండరాలపై బొజ్జ గణపయ్యను చూపిన తీరు గతంలో జాతీయ వార్తల్లో కూడా నిలిసింది. పొట్టపై మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన దృశ్యాన్ని చూసి ఓరా అనాల్సిందే. పొట్ట కండరాలపై శివ లింగం, పూరీ జగన్నాధుడు ఆయనలోని భక్తికి నిదర్శనాలు. సమాజానికి చక్కని సందేశాన్ని ఇస్తూ సచ్చిదానంద యోగి వృక్షో రక్షతి రక్షితః అంటూ చెట్టు ఆకృతిని, స్టాప్ స్మోకింగ్ అంటూ ఊపిరితిత్తులు ఆకారాన్ని, యోగా ను ప్రచారం చేస్తూ యోగా డే లోగో ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 30కి పై కళాకండాలను తానే సొంతంగా అద్దంలో చూసుకుంటూ తన శరీరంపై రంగులు వేసుకుంటూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
This browser does not support the video element.
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
2010లో అనారోగ్యం కారణంగా యోగా చేయడం మొదలు పెట్టిన ఆయన.. వ్యాధి నుండి కొలుకోవడమే కాకుండా.. అందరికి యోగా అందించేందుకు సన్యాస దీక్ష తీసుకొని యోగిగా మారారు. యోగాను రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేస్తూ వేలాదిమందికి యోగా నేర్పించారు. 2015లో ఆగ్రాలో జాతీయ స్థాయి యోగ పోటీల్లో బంగారు పతకం, 2016లో శ్రీలంకలోని కొలంబో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందారు. వీరి సేవలకు గాను గురుశ్రేష్ఠ, యోగభూషణ్ వంటి బిరుదులుతో పాటు.. 2020లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాష్ట్ర ద్వారా ప్రశంస పత్రం, రజత పతకం పొందారు. కాగా, తాజాగా సచ్చిదానంద యోగి పొట్టలో యోగాతో చేస్తున్న విభిన్న కళా రూపాలు లండన్ కు చెందిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నారు.
Also Read:
Viral: స్కూటీ హెడ్ లైట్ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా ఓపెన్ చేయగ గుండె గుభేల్..
Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ..