AP: లోన్ యాప్‌లో అప్పు.. ఇంటీరియర్ పనులు చేస్తూ దొంగతనం.. చివరికి ఏం జరిగిందంటే?

లోన్ యాప్‌లో అప్పు చేసి తీర్చలేక దొంగతనం చేసిన వ్యక్తిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఖాజా పీర్ అనే వ్యక్తి ఇంటీరియర్ పనులు చేస్తూ దొంగగా మారాడు. అతని వద్ద నుంచి రూ.12 లక్షలు విలువ చేసే 30 తులాల బంగారు నగలు, రూ. 37వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

New Update
AP: లోన్ యాప్‌లో అప్పు.. ఇంటీరియర్ పనులు చేస్తూ దొంగతనం.. చివరికి ఏం జరిగిందంటే?

Ananthapur: అనంతపురంలోని భవానినగర్ లో చంద్రమోహన్ రెడ్డి, లతా రెడ్డి అనే దంపతుల ఇంట్లో దొంగతనం జరిగింది. 30 తులాల బంగారు నగదు పోయినట్లు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గంటల వ్యవధిలోని దొంగను పట్టుకున్నారు. ఖాజా పీర్ అనే వ్యక్తి ఇంటీరియర్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల కాలంలో లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకొని అప్పు కట్టలేని పరిస్థితిలో దొంగగా మారాడు.

Also Read: ఏపీలో దారుణం.. కన్న తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కూతురు..!

చంద్రమోహన్ రెడ్డి,  లతారెడ్డి ఇంటికి ఇంటీరియర్ చేసే క్రమంలో ఆ ఇంటిలోనే బంగారు నగలు ఉన్నట్లు గమనించి, ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి దొంగతనం చేశాడు.  పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగని పట్టుకొని బంగారు నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు.  దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు డిఎస్పి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు