TTD: తిరుమలలో నకిలీ ఐఏఎస్..ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం..కట్ చేస్తే కటకటాలపాలు..! తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదారలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ ఇచ్చారు. అతని వైఖరిపై అనుమానంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD: తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. నరసింహారావు అనే వ్యక్తి ఐఏఎస్ అని చెప్పి గురువారం స్వామివారి దర్శనానికి వచ్చాడు. టీటీడీ ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖను అందించాడు. తాను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పాడు. అతను ఇచ్చిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో కార్యాలయ అధికారులు అనుమానంతో అతన్ని ప్రశ్నించారు. అయితే నరసింహారావు తడబడటంతో పాటు అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అతడి వైఖరిపై అనుమానం వచ్చింది. వెంటనే ఈవో కార్యాలయం సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఆరా తీశారు. నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావుపై పోలీసులకు టీటీడీ విజినెల్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ గుంటూరు, విజయవాడలో కూడా ఇదే తరహాలో నరసింహారావు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నరసింహారావును ప్రశ్నిస్తున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తునకు సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: చంపేసిన మూడనమ్మకం..గ్రహణ భయంతో తన భర్తను,పిల్లలను ఎలా చంపిదో తెలుసా? #ttd #ias-officer #duped #vip-darshan-tickets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి