/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/temple-jpg.webp)
Ambedkar Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని మందపల్లి శనేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. ప్రసిద్ధి గాంచిన శనీశ్వరస్వామి వారి విగ్రహం(లింగం)పై గుర్తుతెలియని వ్యక్తి నూనెకు బదులు పెట్రోల్ పోసినట్టు సమాచారం. ఓ వ్యక్తి స్వామివారి అభిషేకానికి తెచ్చిన ఆయిల్ అభిషేకం చేస్తుండగా పెట్రోల్ వాసన రావడంతో అర్చకులు వెంటనే అప్రమత్తమయ్యారు.
అర్చకులు భక్తులను నిలదీయడంతో రావులపాలెంలో ఆయిల్ తీసుకుని వచ్చానని తనకేమీ తెలియదని చెప్పాడు ఓ భక్తుడు. దీంతో, స్వామివారికి సంప్రోక్షణ చేసి మరల తిరిగి అభిషేకాలు ప్రారంభించారు. అయితే, పెట్రోల్ తో ఉండగా హారతి ఇస్తే పెను ప్రమాదం సంభవించేది. అర్చకులు వాసన గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
Also Read: అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్ రావు ఫైర్..
ఈ ఘటనపై ఆలయ ఈవో విజయలక్ష్మి స్పందించారు.పెట్రోల్ కలిసిన బాటిల్లో ఆయిల్ వేయడంతో స్వామి వారికి అభిషేకం చేస్తుండగా పెట్రోల్ వాసన గుర్తించామని తెలిపారు. వెంటనే, సంప్రోక్షణ చేసి తిరిగి అభిషేకాలు ప్రారంభించామన్నారు. అయితే, వచ్చిన భక్తుడు ఎవరనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. అతను ఇలా కావాలనే చేశాడా? లేదంటే అనుకోకుండా అలా జరిగిందా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్టు చెప్పారు.
కాగా, కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.