Mallika Sagar: ఐపీఎల్‌ హిస్టరీలో నెవర్‌ బిఫోర్‌.. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మహిళా ఆక్షనీర్‌!

ఐపీఎల్‌ పురుషుల వేలం చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తుననారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షనీర్‌గా అందరి దృష్టిని మల్లిక సాగర్‌ ఆకర్షించిన విషయం తెలిసిందే! మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌కు కూడా ఆక్షనీర్‌గా వ్యవహరించారు.

New Update
Mallika Sagar: ఐపీఎల్‌ హిస్టరీలో నెవర్‌ బిఫోర్‌.. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మహిళా ఆక్షనీర్‌!

ఐపీఎల్‌ మినీ ఆక్షన్‌కు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఫ్రాంచైజీలు తమ జేబులో డబ్బులను ఖాళీ చేసుకోనున్నాయి. ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్‌ను కొంటుందన్నదానిపై ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్-2024 వేలంలో 333 మంది ఆటగాళ్లు ఉండగా, గరిష్టంగా 77 స్లాట్లను 10 ఫ్రాంచైజీలు భర్తీ చేయనున్నాయి. అందులో విదేశీ ఆటగాళ్లకు 30 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఐపీఎల్-2024 వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. భారత్‌లో జియో సినిమా ద్వారా ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. భారత్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కానుంది. ఇక దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 వేలానికి మల్లికా సాగర్(Mallika Sagar) వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఐపీఎల్‌ మెన్స్‌ ఆక్షన్‌లో ఓ మహిళ ఆక్షనీర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి.

ఆర్ట్‌ కన్సల్టెంట్‌:
నిజానికి విమెన్స్ ప్రిమియర్‌ లీగ్‌లోనూ ఆక్షనీర్‌ మల్లికనే. తొలి రెండు సీజన్‌లకు ఆమె ఆక్షనీర్‌గా వ్యవహరించాడు. మల్లికా సాగర్ (Mallika Sagar) ముంబైలో ఆర్ట్‌ కలెక్షన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్ట్‌ ఇండియా సంస్థలో పని చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించిన మల్లిక సాగర్, యునైటెడ్ స్టేట్స్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నగరంలో నివసిస్తున్నారు. అక్కడ ఆమె ఆర్ట్‌ హస్టరీలో డిగ్రీని పొందారు. ఇప్పుడు మోడ్రాన్‌ ఆర్ట్‌లో నిపుణురాలు. ప్రైవేట్ యాజమాన్యంలోని ముంబైకి చెందిన వేలం సంస్థలో వేలంపాటదారుగా ఉన్న ఆమె చాలా కాలంగా గ్లోబల్ ఆర్ట్ వేలం సర్క్యూట్లో మార్గదర్శిగా ఉన్నారు. 2001లో అంతర్జాతీయ ఆర్ట్ అండ్ లగ్జరీ బిజినెస్ క్రిస్టీస్ లో భారత సంతతికి చెందిన తొలి మహిళా వేలంపాటదారుగా నిలిచారు.

2019 నుంచి 2022 వరకు నాలుగు ఐపీఎల్ వేలం నిర్వహించిన మాజీ ఐపీఎల్ వేలంపాటదారు ఎడ్మీడెస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు మల్లిక సాగర్. నిజానికి ఎడ్మీడెస్‌ అంటే కూడా భారతీయులకు ఇష్టం. అయితే రిప్లేస్‌మెంట్‌ మల్లిక కావడంతో అతను ఈ సారి లేకున్నా ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉన్నారు. ఎల్ వేలాన్ని హ్యూ ఎడ్మీడ్స్‌తోపాటు రిచర్డ్‌ మ్యాడ్లీ, చారు శర్మ ఇప్పటివరకు నిర్వహించారు. ఇక మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌కు కూడా ఆక్షనీర్‌గా వ్యవహరించారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌ వేలం సందర్భంగా ఆమె అందరినీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 పురుషుల వేలాన్ని కూడా మల్లికా సాగర్‌తో నిర్వహించాలని నిర్వహకులు ఫిక్స్‌ అయ్యారు.

Also Read: రోహిత్‌ ఫ్యాన్స్‌ నిరసనల వేళ ఐపీఎల్‌ వేలం.. ఆక్షన్‌లో ప్రధాన ఆటగాళ్ల లిస్ట్ ఇదే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు